The bullet news ( Nellore ) _ ” రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు.. జిల్లా నాయకులను సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.. మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మినిస్టర్ సాబ్” అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నగర మేయర్ అబ్దుల్ అజీజ్..అల్లీపురంలోని మంత్రి స్వగృహంలో సోమవారం ఆయన్ను ప్రత్యేకంగా కలుసుకుని పుష్పగుచ్ఛాలు అందించి శాలువతో సత్కరించారు.. కేక్ కట్ చేసి మంత్రికి తినిపించారు..ఈ సందర్భంగా మేయరు మాట్లాడుతూ మంత్రి సోమిరెడ్డి ఆలోచనలతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి సాధిస్తోందనీ, జిల్లాలోని రైతాంగ సమస్యల పరిష్కారానికి మంత్రి స్పందిస్తున్న తీరు అత్యంత హర్షణీయం అని కొనియాడారు. మంత్రిని కలిసినవారిలో టిడిపి నిర్వాహక కార్యదర్శి నన్నేసాహెబ్, నాయకులు మునవర్, షంషుద్దీన్, మౌలానా తదితరులు పాల్గొన్నారు.