టీవీ ఛానల్ యాంకర్ కు వేధింపులు

70

The bullet news (Hyderabad)- నువ్వంటే నాకిష్టం, నేను నిన్ను ప్రేమించాను. నన్ను పెళ్లిచేసుకో లేదంటే చచ్చిపోతానంటూ ఓ యువకుడు టీవీ ఛానల్ యాంకర్ ను వేధిస్తున్నాడు. సదరు యాంకర్ అతనిపై పిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవీందర్‌(25) ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఫిలింనగర్‌ ప్రాంతంలోని ఓ టీవీ ఛానల్‌లో పనిచేసే వ్యాఖ్యాతను కలిసి, పెళ్లి చేసుకోవాలని అడిగేందుకు రెండు రోజుల కిందట నగరానికి వచ్చాడు. ఆమె పని చేసే ఛానల్ కార్యాలయానికి వచ్చి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె నిరాకరించింది. 2014 లో కూడా ఇలాగె వేధించడంతో ఆమె అతనికి గట్టిగానే బుద్ధి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆ యాంకర్ బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె పిర్యాదు ఆధారంగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే సదరు యాంకర్ కు ఇదివరకే వివాహం అయినట్టు తెలుస్తుంది.

SHARE