24 గంటల్లో జంట హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు…

142

THE BULLET NEWS (WARANGAL):-హసన్‌పర్తి పట్టణంలో కలకలం రేపిన వృద్ద దంపతుల హత్య మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడి బుధవారం హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తికి చెందిన గడ్డం దామోదర్‌(58), పద్మ(49) దంపతులు సోమవారం రాత్రి గుర్తు దారుణ హత్య గురయ్యారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు హసన్‌పర్తికి చెందిన కిరాణ దుకాణం యజమాని కామారపు ప్రశాంత్‌(32)గా గుర్తించి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.4,75,863 విలువ చేసే బంగారాన్ని, 356.240 గ్రాములు వెండి అభరణాలు, ఒక కత్తి, సెల్‌ఫోన్‌తో పాటు 6,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దామోదర్‌ పొరుగింట్లోనే ఉంటున్న ప్రశాంత్‌ ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం.

 

SHARE