ఆయన ప్రజా నాయకుడు..- నేదురుమల్లి రంజన్ రెడ్డి వెల్లడి

144

The Bullet News ( Vakadu)_ వైఎస్సార్ మరణము తర్వాత రాష్టం అనాధగా మరిపోయిందన్నారు వాకాడు మండల వైసిపి అధ్యక్షుడు నేదురుమల్లి రంజన్ రెడ్డి.. వైఎస్సార్ 9వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.. అనంతరం పండ్లు పంచి పెట్టారు.. ఈ సందర్భంగా రంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాయన్నారు.. ప్రజల గురించి నిరంతరం తపించే ప్రజనాయకుడు వైఎస్సార్ అన్నారు.. అనంతరం వైసిపి సీనియర్ నాయకులు నేదురుమల్లి పద్మనాభ రెడ్డి చేతులమీదుగా ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో గౌరవ్ సాయి రెడ్డి, నందగోపాల్ రెడ్డి, వైసీపీ యువ నాయకులు రాయపు రవీంద్ర, ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

SHARE