తెలుగు జాతి ఔన్నత్యాన్ని, కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాల కు పరిచయం చేసిన మహానీయుడు ‍

127

The bullet news (Sarvepalli)_   తెలుగు జాతి ఔన్నత్యాన్ని, కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన మహానీయుడు నందమూరి తారకరామారావని టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.. నియోజకవర్గంలోని వెంకటాచలంలో ఎన్టీయార్ 22వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఆయన అనంతరం రక్తదాన శిబిరానికి నిర్వహించారు.. దాదాపు 120 మందికి పైగా యువకులు రక్తదానం నిర్వహించారు.. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ యువత ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, నీతినిజాయతీలతో ముందుకు సాగాలన్నారు.. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేద, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు. పేదల కోసం అనేక చారిత్రాత్మక పథకాలు ప్రారంభించడంతో పాటు అమలు చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు.. ఎన్టీయార్ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని విక్రమార్కుడిలా పనిచేస్తున్నారన్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు..

SHARE