తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాల్లో పోటెత్తిన భక్తజనం

212

 

THE BULLET NEWS – కర్నూలు జిల్లా:  శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. పాతాళగంగలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహానంది, యాగంటి, కాల్వబుగ్గ శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ. గోనెగండ్ల శివాలయంలో వీరశైవలింగ పిఠాధిపతి శివయ్య ఆధ్వర్యంలో మహారుద్రాక్ష పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా హాజరయ్యారు. మహాశివరాత్రిని పురస్కరించుకుంది మహానంది క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం గజవాహనం, రాత్రి వృషభ వాహనంపై స్వామివారు ఉరేగనున్నారు. రాత్రి10 గంటలకు లింగోద్భవం, 12గంటలకు కళ్యాణం జరుగనుంది.  చిత్తూరు జిల్లాలోని : శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని : భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దనస్వామి, పాలకొల్లు పంచారామ క్షేత్రం క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. కొవ్వూరులో మహాశివరాత్రి సందర్భంగా గోష్పాద క్షేత్రం గోదావరి నదిలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని: శివరాత్రి సందర్భంగా పాల్వంచలో ఆత్మలింగేశ్వర ఆలయంలో సూర్యకిరణాలు శివలింగాన్ని తాకాయి. ఈ దృశ్యాన్ని చూసి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.ప్రకాశం జిల్లాలోని: మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతకం, భైరవకోన, జమ్ములపాలెం, సోపిరాల, సంగమేశ్వరం, మనికేశ్వరం శివ క్షేత్రాల్లో భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. . మంచిర్యాల జిల్లాలోని: శివరాత్రి సందర్భంగా గూడెం, లక్షెట్టిపెట్, మంచిర్యాల, చెన్నూరు గోదావరి తీరాల్లో వేలాది మంది భక్త్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జిల్లా కేంద్రం లోని విశ్వనాథ ఆలయంతో పాటు వేలాల, బుగ్గ, కత్తరశాలల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసి పోతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని : కాళేశ్వరంలో శివరాత్రివేళ భక్తులు పోటెత్తారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిలకు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ : ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురంలోని శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని : జొన్నవాడ, మూలాపేట,కోవూరు,గండవరం శైవక్షేత్రాలలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.ఆత్మకూరు, సంగం, అనంతసాగరం శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని: జిల్లా వ్యాప్తంగా శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. బేతుపల్లి గౌతమేశ్వరస్వామి ఆలయం, తీర్ధాల సంఘమేశ్వరస్వామిఆలయం, నీలాద్రీశ్వరస్వామి వారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.రంగారెడ్డి జిల్లాలోని: శంషాబాద్‌ మండలంలోని సిద్ధులగుట్ట, శక్కరిమఠం, ధర్మగిరి, శివ్‌, శంకర్‌, హనుమాన్‌, స్పటిక్‌ శివాలయాలకు భక్తులు పోటెత్తారు.

SHARE