భ‌క్తులతో ర‌ద్దీగా మారిన ప్ర‌కృతి సోయగం

100

THE BULLET NEWS (SYDHAPURAM)-చుట్టుఎత్తైన కొండలు.. పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఆ ప్రదేశం చూడగానే ప్రకృతి ప్రేమికులకు మనస్సు పులకరిస్తుంది.. ప్ర‌కృతి ఒడిలో సేదతీరాల‌నిని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి… అలాంటి ప్రదేశంలో కార్తీమాస పూజ‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. సైదాపురం మండల పరిధిలోని సిద్దలకోనలో వెలసియున్న నవనాథసిద్దేశ్వర , సారంగధరుల స్వామివార్లకు సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో వరుసగా అయిదు సోమవారాలు తిరునాళ్ళను తలపించేలా భక్తులు తరలివస్తుంటారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు .ఈ క్రమంలో అయిదవ సోమవారం రోజున స్వామి వార్ల కు ప్రత్యేక పూజలతో పాటు తేప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వార్లను దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు..

SHARE