THE BULLET NEWS (TIRUMALA)- రథసప్తమిని పురస్కరించుకుని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల కొండపై బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున కొండకు తరలివచ్చారు.మరోవైపు తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రథ సప్తమి సందర్భంగా శ్రీనివాసుడు ఏడు వాహనాలపై ఊరేగనున్నాడు. రథసప్తమి నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో నేడు ఆర్జిత సేవలు,  వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, కాలినడక భక్తులకు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.

SHARE