గజల్ శ్రీనివాస్‌కు కోర్టులో చుక్కెదురు.. బ్యాక్ టు చంచల్‌గూడ

93

The bullet news (Hyderabad)- గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టులో చుక్కెదురు అయింది. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. బెయిలు కోసం వాదనలు పూర్తయ్యాక పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

తొలుత శ్రీనివాస్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో 354 సెక్షన్ వర్తించదని, కాబట్టి తమ క్లైయింట్‌కు బెయిలు మంజూరు చేయాలని కోరారు. అసలు సెక్షనే వర్తించనప్పుడు ఆయనను జైల్లో ఎలా పెడతారని కోర్టును ప్రశ్నించారు. ఆయన రేపు నిర్దోషిగా బయటపడిన తర్వాత శ్రీనివాస్ జైల్లో గడిపిన నష్టాన్ని ఎలా పూడుస్తారని కోర్టును అడిగారు. దీంతో ఈ కేసుకు సంబంధించి కౌంటర్ ఫైల్ చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది వినిపించిన వాదలనతో ఏకీభవించిన న్యాయమూర్తి గజల్ శ్రీనివాస్ పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో శ్రీనివాస్‌ను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

SHARE