జాతీయ ర‌హ‌దారిపై బైక్- స్కార్పియో ఢీ.. ఒక‌రు మృతి

173

THE BULLET NEWS (KODAVALUR)-వేగంగా వ‌స్తున్న స్కార్పియో ఢీకొని ఓ యువ రైతు మృతిచెందాడు.. ఈ ఘ‌ట‌న  కొడవలూరు జాతీయ‌ర‌హ‌దారి రామన్నపాలెం గేటు సమీపంలో కాసేప‌టి క్రితం చోటు చేసుకుంది.. నార్తురాజుపాళెం దీన్నేకు చెందిన రైతు సురేష్ రెడ్డి (26) ఐస్ కోస‌మని స‌మీపంలోని ఐస్ ప్యాక్ట‌రీ వ‌ద్ద‌కు వెళ్లి తిరిగి బైక్ మీద ఇంటికొస్తున్నాడు.. ఇదే స‌మ‌యంలో వేగంగా వ‌స్తున్న స్కార్పియో ఒక్కసారిగా సురేష్ రెడ్డి బైక్ ను ఢీకొట్టింది.. ఈ ఘ‌ట‌న‌లో సురేష్ అక్క‌డిక్క‌డే మృతిచెందాడు.. విష‌యం తెలుసుకున్న రూరల్ డిఎస్పీతో పాటు కోవూరు, కొడవ‌లూరు ఎస్ ఐలు సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు..

SHARE