మార్నింగ్‌వాక్ ఎలా చేయాలంటే..

15

The bullet news (Health)_ ప్రతీరోజూ మార్నింగ్‌వాక్ చేయడం వలన మనం ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోగలుగుతాం. తెల్లవారుజామున వీచే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ వాకింగ్ చేయడం వలన శరీరానికి సమృద్ధిగా ఆక్సిజన్ అందుతుంది. మార్నింగ్‌వాక్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రశాంతమైన, పచ్చని చెట్లు ఉన్న ప్రాంతాన్ని మార్నింగ్‌వాక్‌కు ఎంచుకోవాలి. మార్నింగ్‌వాక్‌కు వెళ్లేముందు ఒక గ్లాసు మంచినీటిని తప్పక తాగాలి. హృదయ సంబంధిత వ్యాధులు, హై బీపీ ఉన్న వారు మార్నింగ్‌వాక్ చేయాలనుకుంటే, ముందుగా వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం. ఎవరికితగ్గట్టు వారు తమ వయసును అనుసరించి వాకింగ్ చేయడం ఉత్తమం. వాకింగ్‌చేసే సమయంలో పాదాలకు సౌఖ్యాన్ని అందించే చెప్పులు, లేదా షూస్ ధరించాలి. మంచి ఆరోగ్యం కోసం అరగంట పాటు వాకింగ్ చేయడం మంచిది. వారంలో ఏడు రోజులూ వాకింగ్ చేయలేనివారు కనీసం నాలుగు రోజులైనా చేయడం ఆరోగ్యదాయకమని నిపుణులు సూచిస్తున్నారు.

SHARE