మానవత్వం చాటిన ఎస్ఐ వేణు

88

THE BULLET NEWS (SANGAM)-మానవత్వం చాటుకున్న నెల్లూరు జిల్లా సంగం SI జి వేణు…ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 వాహనం వచ్చేంత వరకూ వేచి చూసి ఆ తర్వాత సంఘటన స్థలానికి తాపీగా వచ్చే పోలీసులను చూసి ఉంటారు..కానీ రక్తమోడుతున్న క్షతగాత్రులను తన వాహనంలో హాస్పటల్ కు తరలించి ప్రాణాలు కాపాడిన సంఘటన ఇది .. సంగం పోలీస్ స్టేషన్ పరిధిలో తరుణవాయి క్రాస్ రోడ్డు వద్ద ఓ ఆటో బోల్తా పడ్డ విషయం తెలుసుకుని సంఘటన చేరుకున్న ఎస్సై ఆటోలో ప్రయాణిస్తున్న అయిదు మందికి తీవ్రంగా రక్తం కారుతూ ఉన్న దృశ్యం చూసి అంబులెన్సు వాహనం రావడానికి ఆలస్యమవుతున్న సంగతి తెలుసుకుని వెంటనే తన పోలీసు జీపులో ఐదుగురిని బుచ్చి హాస్పిటల్ కు తరలించారు. సమయానికి క్షతగాత్రులను హాస్పటల్ కు తరలించడంతో ముగ్గురి ప్రాణాలు కాపాడిన సంగం ఎస్సై వేణు గారికి హ్యాట్సాఫ్ ..ఎస్ఐ చొరవ చూపి ముగ్గురి ప్రాణాలు కాపాడినందుకు స్థానికులు ఎంతో అభినందిస్తున్నారు

SHARE