నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎందాకైనా వెళ్తా.. – మంత్రి సోమిరెడ్డి

81

THE BULLET NEWS (MANUBOLU)-అధికారం ఉన్నా.. లేకున్నా నిరంతరం సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసమే పని చేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.. మనుబోలు మండలం బండేపల్లిలో ఇవాళ వైసిపి కి చెందిన దాదాపు 20 కుటుంబాలు మంత్రి సమక్షంలో టిడిపిలో చేరాయి.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానం పలికారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్న వారందరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నామన్నారు.. మీ అందరి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానన్నారు.. టిడిపిలో ఉడతా రవి, ఉడతా మురళి, పోలయ్య, రాజా, రాజగోపాల్, చేవూరు శ్రీనివాసులు, ఆవుల శంకరయ్య, ఉడతా సోమశీనయ్య, చేవూరు పెంచలయ్య, పొడుగు రమణయ్య, చేవూరు చెంచయ్య తదితరులు ఉన్నారు..

SHARE