నాన్నకు ప్రేమతో.. ఖరీదైన కారుతో సహా..

76

The bullet news (Naiziriya)- చిన్నప్పుడు నాన్న ఒడిలో కూర్చోపెట్టుకుని చెప్పిన కథలు.. పెద్దయ్యాక ఏమవుతావు నాన్నా.. అన్న తండ్రి అడిగిన ప్రశ్నలు.. నువు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలి అన్నమాటలు ఇంకా గుర్తున్నాయి. అవున్నాన్నా.. నేను పెద్ద ఉద్యోగం చేసి పెద్ద కారు కొని అమ్మని నిన్ను అందులో కూర్చొబెట్టుకుని ఊరంతా తిప్పేస్తాను అని వచ్చీరాని మాటలు అంటుంటే నాన్నకి ఎంత సంతోషం. చిన్నారి మాటలకి కడుపు నిండిన ఆనందం ఆ తండ్రి కళ్లలో కనిపిస్తుంది. తనవితీరా ముద్దులు పెట్టుకుని మురిపెంగా చూసుకుంటాడు. మరి ఆ తండ్రి కోరిక నెరవేరకుండానే అతడు మరణిస్తే.. పెరిగి పెద్దవాడైన బిడ్డ గుండె తల్లడిల్లదూ..

నైజీరియాకు చెందిన అజుబుకి అనే వ్యక్తి తన తండ్రి హాఠాన్మరణాన్ని తట్టుకోలేకపోయాడు. తండ్రితో తాను చాలా సార్లు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అన్నట్లుగానే తన కోరిక నేరవేర్చాలని, అదే తన తండ్రికి అర్పించే నిజమైన నివాళి అని భావించాడు అజుబు. తండ్రి మరణించిన మరుక్షణమే కొత్త బీఎండబ్ల్యూ కారు కొని  తండ్రి మృతదేహాన్ని కారులో ఉంచి సమాధి చేశాడు. నైజీరియాలోని ఎక్కడో మారుమూల గ్రామం ఎంబొసిలో జరిగిన ఈ ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. అజుబికీ నెటిజన్స్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.
SHARE