జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర లో పాల్గొంటా.. టాప్ హీరో సంచలన వ్యాఖ్యలు

182

The bullet news ( Cinema) _ తమిళ హీరో సూర్యకి, వైస్సార్ ఫ్యామిలీ కి మంచి రిలేషన్స్ ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. వైస్సార్ బతికి ఉన్నప్పుడు సూర్య చాలా సార్లు జగన్ ఇంటికి వెళుతుండే వాడంటా. ఈ విధంగా తన అభిమానాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్ కావాలని ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్‌ను పంపాడు.జగనన్న చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర విజయం కావాలని కోరుకుంటున్నా.జగనన్న ఎప్పుడూ ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపనలో ఉంటాడు. నిరంతరం అదే ఆలోచన. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో, నేను చదువుకుంటున్న సమయంలో జగనన్న ఇంటికి చాలాసార్లు వెళ్లాను. నాకు ఆ వైఎస్ఆర్ కుటుంబంపై దగ్గరి సంబంధాలే ఉన్నాయి.కష్టపడే తత్వం జగనన్నలో ఉంది. అందుకే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లోనే జగన్ అంటే నాకు ఇష్టం. ఆయన చేస్తున్న పాదయాత్రలో నేను పాల్గొంటాను. త్వరలో పాదయాత్రకు వెళ్ళి జగన్‌ను కలిసి వస్తానని చెప్పారు సూర్య. దీనితో ఒక తమిళ టాప్ హీరో జగన్ మోహన్ రెడ్డి కి మద్దతు ఇచ్చేసరికే వైస్సార్సిపిపార్టీ వారు కూడా ఆనందంగా ఉన్నారు. ఇప్పటి వరకు టిడిపి వారికి మాత్రమే సినీ హీరోలా నుంచి మద్దతు ఉండేది ఇప్పుడు ఆ మద్దతు వైసీపీ కుడా వస్తుంది అని చెప్పవచ్చు.

SHARE