ఫలించిన డాన్సర్ల కృషి – గుర్తింపు కార్డులు అందజేసిన అమరావతి కృష్ణా రెడ్డి

90

The bullet news ( నెల్లూరు ) :-  జిల్లాలో డాన్స్ మాస్టర్ల కృషి ఫలించింది.. వారి టాలెంట్ ని, కష్టాన్ని పోలీసు డిపార్ట్మెంట్ గుర్తించింది.. బాగా చదువుకుని నృత్య కళను నమ్ముకున్న వారికి ఎస్పీ తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని కల్గించింది..

గత కొంతకాలంగా శుభకార్యాలకు, పండగలకు నిర్వహించుకునే డాన్స్ కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధించారు.. అసభ్యకరంగా డాన్సులు చేస్తున్నారంటూ ఎస్పీ రామకృష్ణ కి పిర్యాదులు అందడంతో ఆయన వాటికి చెక్ పెట్టారు.. దీనితో డాన్స్ ఇన్స్టిట్యూట్లు పెట్టుకొని ఈవెంట్స్ నిర్వహిస్తున్న వారు రోడ్డున పడ్డారు.. అద్భుతమైన కళ చేతిలో ఉండి కూడా దాన్ని ప్రదర్శించే అవకాశం లేకపోవడంతో 25 కళా సంఘాల గౌరవ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చొరవతో
డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కోదండపాణి, ఇతర సభ్యులు ఎస్పీ రామకృష్ణను కలిశారు.. వారికి జరుగుతున్న అన్యాయం, జరిగే నష్టాన్ని వివరించారు.. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ డాన్స్ కార్యక్రమాల్లో ఎలాంటి అసభ్యకరమైన ఘటనలు జరగనివ్వకుండా డాన్స్ మాస్టర్స్ కి గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు.. దాంతో పాటు నిజమైన డాన్స్ మాస్టర్స్ కి మాత్రమే అవకాశం ఇచ్చేలా వారి బ్యాగ్ గ్రౌండ్ పై. విచారణ జరిపి క్లియర్ ఇమేజ్ ఉన్నవారికే ఐడి కార్డ్స్ ఇచ్చేలా చర్యలు తీస్కున్నారు.. దీని వల్ల డాన్స్ ఈవేట్స్ జరుపుకునే వారికి మాత్రమే డాన్స్ కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.. ఐడీ కార్డులను పర్మిషన్ లెటర్ లను ఎస్పీ సూచనలతో డాన్స్ మాస్టర్స్కి దక్కాయి.. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు పాణి మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు..పర్మిషన్ ఇచ్చిన ఎస్పీ కి, ఇప్పించేందుకు సహకారం ఇచ్చిన అమరావతి కృష్ణారెడ్డికి ఆయన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు..ఎస్పీ తమ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుటామని పాణి అన్నారు..

SHARE