ఓట్లు అడగడానికి వెళ్తే చెప్పుల దండ వేశారు!

52

The bullet news (Madhyapradesh)-  తమ ప్రాంతంలోని తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని భావించిన ఓ వ్యక్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేత మెడలో చెప్పుల దండ వేసి ఘోరంగా అవమానించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధమ్నోడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ధమ్నోడ్‌కు వెళ్లిన బీజేపీ నేత దినేశ్ శర్మకు ఎదురైన అనుభవం ఇది. ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోన్న ఆయనకు ఓ వ్యక్తి వచ్చి చెప్పుల దండను మెడలో వేశాడు. దీంతో బిత్తరపోయిన ఆయన షాక్ కు గురై, వెంటనే తేరుకున్నాడు. తొలుత చెప్పుల దండను వేసుకోడానికి ఆయన నిరాకరించినా, ఆ వ్యక్తి మాత్రం తన ప్రయత్నాన్ని మిరమించకలేదు. ఇక చేసేదేమీ లేక ఆ దండను మెడలో వెయించుకున్నాడు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… నన్ను వాళ్లలో ఒక్కడిగా భావించారని, తాను వారి బిడ్డనని, తన నుంచి వారు ఏదో కోరుకుంటూ తమలోని అసంతృప్తిని ఇలా వెల్లగక్కారని వ్యాఖ్యానించడం గమనార్హం. తాగు నీటి సమస్య అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం కలగలేదని, అందుకే ఈ పని చేశానని చెప్పుల దండను వేసిన వ్యక్తి వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఈ విషయం గురించి తమ మహిళలు మున్సిపల్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే తిరిగి వాళ్లే కేసులు బనాయించి, అనేక సార్లు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పించారని వాపోయాడు. రాత్రిపూట కూడా స్టేషన్‌కు పిలిపించి వేధించారని తెలియజేశాడు.

SHARE