కాపుల‌ను బీసీల్లో చేర్చ‌డంపై నాయుడుపేట‌లో కాపు నేత‌ల హ‌ర్షం

133

The bullet news (Naidupeta)_ కాపులను బీసీల్లో చేర్చ‌డం ప‌ట్ల నాయుడుపేట‌లో కాపు నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చేర్చిన విధంగా కాపుల‌ను బీసీల్లో చేర్చే విధంగా కేబినెట్లో ఆమోద ముద్ర వేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటామ‌న్నారు.. బ్రిటిష్ కాలం లో ఉన్న రిజర్వేషన్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిందన్నారు. కాపులను ఓటు బ్యాంక్ గా వాడుకుని వదిలేశార‌ని కాపుల‌ను గుర్తుపెట్టుకుని చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం కాపులను బీసీల్లో చేర్చ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు.. స్థానిక, చ‌ట్ట‌స‌భ‌ల్లో కూడా ఇదే రిజ‌ర్వేష‌న్లు కొనసాగించాల‌ని వారు చంద్ర‌బాబు నాయుడ్ని విజ్ణ‌ప్తి చేశారు.. ఈ కార్య‌క్ర‌మంలో కాపు నాయ‌కులు ప‌గ‌డాల శివ ప్ర‌దీప్, ముని గోపి, గాదిరెడ్డి గోపీ, రాజాబాబు, మ‌ణి, కొరివి రిషి, ల‌క్ష్మీ నారాయ‌ణ‌, ప్ర‌సాద్, పృద్వి, మోహ‌న్, గాద‌దాసు, చిన్న‌బాబు, జ‌లంద‌ర్ త‌దిత‌రులున్నారు..

SHARE