పెరగనున్న రైల్వే చార్జీల…

94

THE BULLET NEWS (NEW DELHI)-రైల్వే లో పెరుగుతున్న ఖర్చులకు దీటుగా ప్రయాణీకులపై చార్జీల భారం మోపనున్నాయి. నష్టాలను తగ్గించుకునే క్రమంలో నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ప్రయాణీకుల చార్జీలను సమీక్షించాలని పార్లమెంట్‌లో సమర్పించిన కాగ్‌ నివేదిక సూచించింది. రైల్వేలు నిర్వహణా వ్యయాన్ని అధిగమించలేకపోతున్నాయని 2016, మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సమర్పించిన ఈ నివేదిక పేర్కొంది.​

2015-16లో రైల్వేలకు ప్రయాణీకులు, ఇతర కోచింగ్‌ సేవలపై రూ 36,283 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. 2015-16లో రైల్వేల మొత్తం ఆదాయం కేవలం 4.57 శాతం మాత్రమే పెరిగిందని ఇది 2011-15 వరకూ సాధించిన 14.86 శాతం వృద్ధి కంటే చాలా తక్కువని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ‘రైల్వేలు నష్టాలను తగ్గించుకునే క్రమంలో ప్రయాణీకుల చార్జీలను దశలవారీగా సవరించాల్సిన అవసరం ఉంద’ ని నివేదిక స్పష్టం చేసింది.

రైల్వేల ఆర్థిక పరిస్థితి..ప్రస్తుత మార్కెట్‌ తీరుతెన్నులతో పాటు నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ప్రయాణీకుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలను నిర్ణయించాలని పేర్కొంది. ప్రయాణీకుల సేవలపై నష్టాలను కేవలం ఏసీ ఫస్ట్‌క్లాస్‌, ఫస్ట్‌క్లాస్‌, ఏసీ 2-టయర్‌పైనే రికవరీ చేయాలనుకోవడం సరైంది కాదని తెలిపింది. 

SHARE