నిరుపేదల గుండెల్లో ఇందిరమ్మ సజీవంగా ఉన్నారు..- డీసీసీ అధ్యక్షులు పనబాక

66

THE BULLET NEWS (NELLORE)-మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు నెల్లూరులో ఘనంగా
జరిగాయి.. డీసీసీ అధ్యక్షులు పనబాక కిష్ణయ్య ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి
నివాళ్లర్పించారు.. నగరలో నిర్వహించిన బైక్ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు భారీగా పాల్గొన్నారు., ఈ
సందర్భంగా పనబాక కిష్ణయ్యమాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన ప్రధానమంత్రుల్లో
ఇందిరాగాందీ మొదటి వారన్నారు.. నేటి తరానికి ఆమె ఆదర్శమన్నారు.. ప్రధానమంత్రిగా ఇందిరాగాందీ ఉన్న
రోజుల్లో భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిస్తే ప్రస్తుతం దేశం నియంత్రుత్య దోరణిలో నడుస్తోందన్నారు..
మోడీ కార్పోరేట్ శక్తులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. గ‌రీబీ హ‌ఠావో నినాదంతో నిరుపేద‌ల
గుండెల్లో ఇందిర‌మ్మ స‌జీవంగా ఉన్నార‌న్నారు.

SHARE