హాంకాంగ్‌తో భారత్‌ మ్యాచ్‌ నేడు

82

The bullet news (Cricket)_ ఆసియా కప్‌లో టీమిండియా ఇవాళ తొలి మ్యాచ్‌ ఆడనున్నది. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌తో తలపడనుంది. భారత జట్టుకు ఈ మ్యాచ్‌ పాకిస్థాన్‌తో జరిగే పోరుకు ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. కోహ్లి గైర్హాజరీలో భారత్‌కు రోహిత్‌ శర్మ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌ అన్ని రంగాల్లో ఎంతో బలమైన జట్టే అయినా.. రోహిత్‌ సేన హాంకాంగ్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. మిడిలార్డర్‌లో తగిన బ్యాట్స్‌మన్‌ లేక ఇబ్బంది పడుతున్న భారత్.. ఆ సమస్యకు ఆసియా కప్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని భావిస్తోంది. అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే మధ్య మిడిలార్డర్‌ పోటీ ఉంది. ఓపెనర్లుగా రోహిత్‌, ధవన్‌.. వన్‌డౌన్‌లో కేఎల్‌ రాహుల్‌ రానున్నారు.

జట్లు.. అంచనా
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, రాయుడు, మనీష్‌ పాండే/జాదవ్‌, ధోనీ, పాండ్యా/అక్షర్‌పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌

హాంకాంగ్‌: నిజాకత్‌ ఖాన్‌, అన్షుమన్‌ రథ్‌ (కెప్టెన్‌), బాబర్‌ హయత్‌, కించిత్‌ షా, క్రిస్టోఫర్‌ కార్టర్‌, ఎహ్‌సాన్‌ ఖాన్‌, అజీజ్‌ ఖాన్‌, స్కాట్‌ మెక్‌చినీ, తన్వీన్‌ అఫ్జల్‌, ఎహ్‌సాన్‌ నవాజ్‌, నదీమ్‌ అహ్మద్‌

SHARE