ప్రభుత్వ దవాఖానలో రోగుల దుస్థితి…

139

THE BULLET NEWS (VIJAYANAGARAM):-స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అన్ని చెపుతున్నారు… తరాలు మారినా ఈ ఒక్క మాట మాత్రం మారటం లేదు.ఎప్పటికి అభివృద్ధి చెందిన దేశం అంటారో ఆ పరమాత్మకే ఎరుక…ఇదే పరిస్థితి లో ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వ హాస్పిటల్స్..

ఈ దృశ్యాలు చూసి మొన్నటి కేరళ బాధితులకు అందిస్తున్న వైద్యం అనుకునేరు… కాదు ఇది మన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో రోగుల దుస్థితి. ప్రభుత్వ హాస్పిటల్ పై ప్రజలకు నమ్మకం తెచ్చేందుకు ప్రభుత్వలు ఎన్ని చేసిన అవి అమలు కావడం లేదు.. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్ పై ఉండే అపోహలు తొలగించేందుకు ప్రభుత్వ హాస్పిటల్ లో శస్త్రచికిత్స చేయించుకున్నారు…కానీ ఇటువంటి దృశ్యాలు చూస్తే అటువంటివి మరిచిపోవాల్సిందే…

SHARE