భారత మహిళల బౌలర్ గోస్వామికి అరుదైన గౌరవం…

119

THE BULLET NEWS-భారత మహిళల క్రికెట్ టీమ్ పేస్ బౌలర్ ఝులన్ గోస్వామికి అరుదైన గౌరవం దక్కింది. మహిళల క్రికెట్‌ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ గా రికార్డు సృష్టించిన ఝులన్ గౌరవార్థం కలకత్తా స్పోర్ట్స్ జర్నలిస్ట్ క్లబ్ ఓ స్టాంప్‌ ను విడుదల చేసింది.

దీనిని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆవిష్కరించాడు. మహిళల క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఝులన్ రికార్డు సృష్టించింది. ఝులన్ ఇప్పటివరకు 10 టెస్టులు, 169 వన్డేలు ఆడింది. వరల్డ్‌కప్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ కూడా ఆమెనే కావడం విశేషం. వరల్డ్‌కప్ మ్యాచుల్లో ఝులన్ 36 వికెట్లు తీసింది. 2007లో ఐసీసీ వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా అందుకుంది.

SHARE