నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌పై ప్ర‌త్య‌క్ష‌ పోరాటానికి దిగుతాం – శ్రీచైత‌న్య డైరెక్ట‌ర్ సుష్మ‌

75

The Bullet news (Nellore)-  త‌మ కాలేజీని దెబ్బ‌తీసేందుకు నారాయణ విద్యా సంస్థ ప్రయత్నిస్తోంద‌ని శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మా చౌదరి ఆరోపించారు. గత రెండు రోజులుగా నారాయణ నుంచి విద్యార్దులను శ్రీచైతన్య యాజమాన్యం తరలించిందన్న తల్లిదండ్రులు పిర్యాదుల నేపథ్యంలో శ్రీచైతన్య నిర్వాహకులపై నెల్లూరులో కేసులు నమోదు చేశారు.. ఈ నేపథ్యంలో ఆమె నెల్లూరొచ్చారు.. తమ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమే నారాయణ విద్యాసంస్థలు చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.. తల్లిదండ్రులు ఇష్టాపూర్వకంగా తమ కాలేజీల్లో విద్యార్దులను జాయిన్ చేశారన్నారు.. కావాలనే నారాయణ విద్యా సంస్థ మా పై కక్ష సాధిస్తోందని ఆరోపించారు..అందులో భాగంగానే తమ కాలేజీ డీన్ రమేష్, పార్దసారధులపై తప్పుడు కేసులు బనాయించి మూడు రోజులుగా స్టేషన్ లో నిర్బందించారని ఆమె ఆరోపించారు.. విలువలతో కూడిన విద్యను అందించమే మా లక్ష్యమని నారాయణ విద్యా సంస్థల్లా తమకు విద్యార్దులను తీసుకెళ్లడం రాదని ఆమె వెల్లడించారు.. గత కొన్నేళ్లుగా నారాయణ విద్యాసంస్థలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇకపై ప్రత్యక్ష పోరాటాలకు సిద్దమవుతామని ఆమె హెచ్చరించారు.

SHARE