ఆ హత్యలకు ఇంటలిజెన్స్ వైఫల్యమే కారణం

95

The bullet news (Political)-  అరకులో ప్రజా ప్రతినిధుల హత్యలు జరగడం ముమ్మాటికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రోటోకాల్ సేవలోనే పోలీసులు ఉండటంతో.. ప్రజాప్రతినిధులకు రక్షణ కరువైందని అన్నారు. ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యమేనన్నారు. చంద్రబాబు ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థను తెలంగాణ ఎన్నికల కోసం పంపడంతో మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై మోడీ పైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఏడాదిన్నరిగా రాహుల్ గాంధీ చంద్రబాబుతో స్నేహం చేయడం వలన గాలి వార్తలను ప్రచారంగా మలుచుకోవడం దుర్మార్గం. దేశ రక్షణ వ్యవస్ధ మెరుగుపడకూడదని ప్రతిపక్షాలు కుట్రపన్నుతున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో దేశానికి, ప్రైవేట్ కంపెనీలకు ఎటువంటి సంబంధం లేదు. లాలూ ప్రసాద్, చంద్రబాబు లాంటి అవినీతిపరులు  మాట్లాడడం హాస్యాస్పదంగా ‌ఉంది. యుద్ధ విమానాలను దేశంలోనే తయారు చేయాలన్నదే మోడీ ఆకాంక్ష. ఏపి లో పర్యావరణం ఎంత దుర్మార్గంగా ఉందో అందరికీ తెలుసు. ఎర్ర చందనం అక్రమ రవాణా, అడవులన్నీ కొట్టించేయడం, వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు పర్యావరణ పరిరక్షణ మీద ఐక్యరాజ్యసమితి లో ఎలా మాట్లాడతారని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు

SHARE