ఫైనల్ ఫైట్…

142

THE BULLET NEWS (VIJAYAWADA)-ఐపీఎల్‌లో ఫ్యాన్స్‌కు ఈరోజే అసలైన మజా… లీగ్ దశ, ప్లేఆఫ్, క్వాలిఫయర్ మ్యాచ్‌లతో ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్‌కు ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్ స్పెషల్ ట్రీట్ కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇవాళే ఫైనల్ ఐపీఎల్ షో జరగనుంది. పిచ్‌పై ఆరేంజ్ ఆర్మీ బలమా? చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ తడాఖానా? నేటి ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుందనే దానిపై ఫ్యాన్స్‌లో అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ది సెన్సేషనల్ రికార్డ్… 2010, 2011 సీజన్ల ఛాంపియన్ అయిన ధోనీ గ్యాంగ్… మరో నాలుగు సార్లు రన్నర్‌గా నిలిచింది. ఐపీఎల్‌లో మరి ఏ టీమ్‌కు ఈ స్థాయి ట్రాక్ రికార్డు లేదు. ధోనీ కెప్టెన్సీలో ప్రతీ  సీజన్‌లో చెన్నై టీమ్‌ ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయ్యింది. రెండేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చినా… ఒకప్పటి దూకుడును ఇప్పుడూ చూపిస్తోంది ధోనీ సేన. టాప్ ఆర్డర్, మిడిలార్డర్… ఇలా ఏ విధంగా చూసుకున్న ధోనీ సేనే ఫేవరేట్‌గా ఉంది… ఇక డేవిడ్ వార్నర్ లేని టీమ్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరడం అద్భుతమే… కెప్టెన్ విలియమ్సన్‌ హైదరాబాద్ టీమ్ బలం, బలహీనత… ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్ స్కోర్ అయిన విలియమ్సన్… సింగిల్ హ్యాండ్‌తో ఆరేంజ్ ఆర్మీ భారాన్ని మోస్తున్నాడు. మరో బ్యాట్స్‌మన్ విలియమ్సన్‌కు తోడైతే చాలు హైదరాబాద్‌ అద్భుతం చేయడం ఖాయం. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఎవరో ఒకరు మెరుపు బ్యాటింగ్ చేసి తీరాల్సిందే. ఇక బౌలింగ్ పరంగా చూస్తే మొత్తం ఐపీఎల్‌లోనే హైదరాబాద్‌కు తిరుగులేదు. రెండు బలమైన జట్లలో విజేతను ఊహించడం కష్టమే. కానీ రికార్డు మాత్రం చెన్నైని ఫేవరెట్‌గా నిలుపుతోంది. రెండు జట్లు 9 సార్లు తలపడగా… చెన్నై ఏడు సార్లు పైచేయి సాధించింది. సన్‌రైజర్స్‌ రెండేసార్లు నెగ్గింది. ఈ ఐపీఎల్‌లోనే చెన్నై… 3 సార్లు హైదరాబాద్‌ను ఓడించింది. ఇక ఫైనల్ ఫైట్‌ కోసం రాత్రి 7 గంటల వరకు వేచిచూడాల్సిందే.

SHARE