ఆగని ఇసుక మాఫియా……..

110

✍షేక్ అస్లాం ✍
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలతో పాటు ఓవర్ లోడ్ ను కలిగిన ఉన్న 13 లారీలను విజిలెన్స్ అధికారులు బుచ్చిరెడ్డిపాలెం లో పట్టుకున్నారు. గత రాత్రి విజిలెన్స్ ఎస్పి సుబ్బారావు సిబ్బందితో కలిసి బుచ్చిరెడ్డిపాలెం లోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6 లారీ లతోపాటు ఓవర్ లోడ్ ను కలిగి ఉన్న మరో ఏడు లారీల ను పట్టుకొని బుచ్చిరెడ్డిపాలెం లోని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పి సుబ్బారావు మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలతో పాటు ఓవర్ లను కలిగి ఉన్న మరో ఏడు వాహనాలు స్వాధీనం చేసుకున్నామని.. వీటిని మైనింగ్ శాఖకు అప్ప చెప్పినట్టు వెల్లడించారు . ఇసుక రీచ్ల నుండి ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే వారికి జరిమానాలు విధించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ తనిఖీలలో క విజిలెన్స్ సిఐ లు సుధాకర్ రెడ్డి, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

SHARE