అది మన ఖర్మ – చంద్రబాబు పై నిప్పులు చెరిగిన జగన్

165

The bullet news ( Naidu peta) _ ఎపి ప్రజల ఖర్మ కొద్ది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని విపక్ష నేత జగన్ అన్నారు.నెల్లూరు జిల్లా ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు దేశాలు పట్టుకొని తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు 22సార్లు విదేశీ పర్యటనలు చేశారని, అయినప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా తీసుకురాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా సాధారణ విమానాల్లో కాకుండా ఖరీదైన ప్రైవేట్‌ విమానాల్లో చంద్రబాబు తిరిగారని, ఓ పక్క రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే తన విదేశీ పర్యటనలకోసం కనీసం రూ.200 కోట్లు ప్రజాధనం వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ప్రతిచోట క్రమం తప్పకుండా ప్రతి గ్రామంలో వినిపిస్తున్న సమస్య తాగునీటి సమస్య. అన్నా తాగడానికి కూడా నీళ్లు లేవని అంతా చెబుతుంటే చాలా బాధేస్తుంది. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ఏం చేశారో అర్థం కావడంలేదు. రాష్ట్రంలో అత్యధికంగా వరి పంట పండే జిల్లా ఇది. ఇక్కడే సోమశిల ప్రాజెక్టు ఉంది. ఇదే జిల్లాలో లక్ష హెక్టార్లు వరి వేయాల్సి ఉండగా ఈసారి మాత్రం కేవలం 39 వేల ఎకరాలు మాత్రమే వేశారు. మన ఖర్మకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు.అని జగన్ వ్యాఖ్యానించారు

SHARE