జగన్ నిర్ణయమే శిరోధార్యం – బీజేపీ నేత రామ్ కుమార్ రెడ్డి ఎంట్రీ పై బొమ్మిరెడ్డి కామెంట్

170

The Bullet News ( Venkata Giri )- “పార్టీలోకి ఎవ్వరు వచ్చినా స్వాగతిస్తాం.. పార్టీని బలోపేతం చేసుకుంటాం.. వచ్చే ఎన్నికల్లో వెంకటగిరిలో కచ్చితంగా వైసీపీ గెలిచితీరుతుంది” అంటూ జడ్పీ చైర్మన్, వెంకటగిరి నియోజక వర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం పై మండిపడ్డారు.. అధికారమే హద్దుగా టిడిపి నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.. వృద్దులకు ఇచ్చే పింఛన్ నుంచి గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల దాకా అన్నింటా అవినీతి ఏరులై పారుతుందన్నారు.. జిల్లా ఎస్పీ రామకృష్ణ పని తీరు భేష్ గా ఉందని, ఆతని పై ఎమ్మెల్యే కురుగొండ్ల నోరు పారేసుకోడం సరి కాదన్నారు.. నిజాయతీ పరులకు అండగా నిలవాలన్నారు.. తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అధికారులపై దాడులు చెయ్యటం, వారిని తిట్టడం అలవాటుగా మారిపోయిందన్నారు.. వైసీపీలోకి బీజేపీ నేత రామ్ కుమార్ రెడ్డి ఎంట్రీ గురించి ప్రస్తావించగా పార్టీ బలోపేతానికి పార్టీలోకి ఎవ్వరు వచ్చినా స్వాగతిస్తామన్నారు.. టికెట్ ఎవ్వరికి ఇచ్చినా జగన్ నిర్ణయమే శిరోధార్యం అన్నారు…

SHARE