విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన జగన్

115

The bullet news  (Political)-   వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 11 జిల్లాలు పూర్తి చేసుకొని 12వ జిల్లాలోకి ప్రవేశించింది. విశాఖపట్నం జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జననేత ఈరోజు విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గం చింతలపాలెంకు చేరుకోగానే వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జననేత తమ జిల్లాలోకి వస్తున్నారని వైసీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో చింతలపాలెం గ్రామం జనసంద్రమైంది. చింతలపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించిన జగన్ ముందుకు సాగారు. అంతకుముందు వైసీపీ అధినేత సమక్షంలో ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు వైసీపీలో చేరారు.

SHARE