జ‌గ‌న్ సైనికుల్లారా.. త‌ర‌లిరండి.. స‌భ‌ను విజ‌య‌వంతం చేద్దాం – ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే కాకాణి

101

The bullet news (Sarvepalli)-  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పొదలకూరు మండలంలోకి ఈ నెల 31న ప్రవేశిస్తుండటంతో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏర్పాట్లను శనివారం పర్యవేక్షించారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభ నిర్వహణపై స్థానిక నాయకులు, కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. సైదాపురం మండలం నుంచి పొదలకూరు మండలం డేగపూడి శివార్లలోకి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశించే ప్రాంతంలో భారీ స్వాగత ఏర్పాట్లను చేయిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆర్చి నిర్మాణంతో పాటు, అక్కడి నుంచి నెల్లూరు రూరల్‌ మండలంలోకి ప్రవేశించే ప్రదేశం వరకు వందల సంఖ్యలో స్వాగత ఫ్లెక్సీలను నిర్మిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణ చేసి ప్రభుత్వంపై ప్రజలకున్న వ్యతిరేకతతో పాటు, పాదయాత్రకు లభిస్తున్న ఆదరణను చూపేందుకు ఎమ్మెల్యే కాకాణి సన్నాహాలు చేస్తున్నారు.

SHARE