బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి…54 చేరిన మృతుల సంఖ్య…

89

THE BULLET NEWS (JAGITHYALA):-కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిని వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన వారికి ప్రఘాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటోందని ఆశిస్తున్నాన్నారు. ఈమేరకు ఇవాళ ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు.ఇక.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు.

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 54కి చేరుకున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ బస్సు శనివారంపేట నుంచి బయలుదేరినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్‌ శ్రీనివాస్‌ మృతిచెందగా.. కండక్టర్‌ పరిస్థితి విషమంగా ఉంది. సుమారు 80 మందితో వెళ్తున్న ఈ ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాట్‌ రోడ్డులోని చివరి మూలమలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్‌, హైదరాబాద్‌, జగిత్యాలలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 25 మంది మహిళలే ఉన్నారు.

 

 

SHARE