ఆంధ్రప్రదేశ్‌ని టీడీపీ ప్రభుత్వం కరప్షన్ ఆంధ్రాగా మార్చింది.-పవన్ కళ్యాణ్.

126

THE BULLET NEWS (GUNTUR)-

*లోకేష్‌ చేసే అవినీతి చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.

*అవసరమైతే బలిదానం కు రెడీ.

*ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధం .

జనసేన ఆవిర్భావ సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, బారికేడ్లను తోసుకుని ముందుకు వస్తున్న అభిమానులు, సీఎం పవన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.జనసేన ఆవిర్భావ సభ వేదిక పై పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ కేంద్రం అంటే మనవారికి భయం, పిరికితనం.దోపిడీ చేసేవారికి పిరికితనం మనకెందుకు భయం.సమస్యలపై పోరాటం చేయడం అంటే నాకు ఇష్టం.నాలుగేళ్ల నుంచి ఏపీకి జరుగుతున్న అన్యాయం మమ్మల్ని బాధ పెట్టింది.సెంటిమెంట్‌తో ప్రత్యేక హోదా ఇవ్వలేమన్నారు.అదే సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చారు.విభజనతో ఏపీకి న్యాయం జరగలేదు.మీరు గౌరవించని చట్టాన్ని మేమెందుకు గౌరవించాలి.పాతిక మంది ఎంపీలతో కేంద్రం 5 కోట్ల మందిని కంట్రోల్ చేయాలని చూస్తోంది. చంద్రబాబు, జగన్‌కి వాళ్లభయాలు వాళ్లకు ఉండొచ్చు.మీరు సీబీఐ కేసులు పెడతారని మిగతావారికి భయం ఉండొచ్చు.కానీ, నాలాంటి వారికి ఎలాంటి భయం లేదు.

నేను సీఎం కొడుకును కాదు, ముఖ్యమంత్రి అల్లుడిని కాదు.నేను ఓ కానిస్టేబుల్‌ కుమారుడిని.మా అమ్మ సెంటిమెంట్‌తో మాట్లాడుతుంది. అందుకే 20 రోజుల నుంచి మాట్లాడడం మనేసేను.ఇక్కడికి వస్తానని ఆమ్మకు చెప్పలేదు.ఇప్పుడు టీవీల్లో చూస్తుండొచ్చు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే కంచె చేను మేసినట్టుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపుదాం.టీడీపీ ప్రభుత్వం మాట్లాడిన మూడు మాటల్లో ఆరు అబద్ధాలున్నాయి.రాజధానికి 1500 ఎకరాలు చాలని సీఎం చంద్రబాబు నాతో అన్నారు.ఇప్పుడది లక్ష ఎకరాలదాకా విస్తరిస్తోంది.అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చంద్రబాబు ప్రభుత్వం లేదు.లక్షల కోట్ల ఎంవోయూలు జరుగుతున్నాయి. కానీ, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు.హోదాపై నేను మాట్లాడినప్పుడు చీకటి ఒప్పందాలు చేసుకుని ప్యాకేజీకి రెడీ అయ్యారు.
అమరావతి కోసం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. మరి గుంటూరులో కలరా వచ్చి చచ్చిపోయారు వాళ్లని చూస్తే బాధ లేదా.ఆంధ్రప్రదేశ్‌ని టీడీపీ ప్రభుత్వం కరప్షన్ ఆంధ్రాగా మార్చింది.

లోకేష్‌ కరప్షన్ చంద్రబాబుకు తెలుసా? లేదా? లేకపోతే తెలిసే చేయిస్తున్నారా?.నారా లోకేష్‌ చేసే అవినీతి చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.చంద్రబాబు ప్రభుత్వం అవినీతితో ప్రజల్లో భయం ఏర్పడింది.2019లో పవన్ మాతో ఉంటాడో లేడో తెలియదు కాబట్టి అవినీతికి పాల్పడతామంటే ఎలా?.2019 ఎన్నికలు టీడీపీకి 2014లో ఉన్నంత సుఖంగా మాత్రం ఉండబోవు.
దేశంలో ఎక్కడా లేనంత అవినీతి ఏపీలో ఉంది. అవినీతి చేసేవాళ్లని తరిమి తరిమి కొట్టాలి.2019 ఎన్నికల్లో ప్రజలు కొత్త పార్టీని, కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు.జనసేన ఉంది జనం కోసం.ఈ రోజు నుంచి టీడీపీ వైఫల్యాలను ఎండగడుతాం.ఇసుక మాఫియాకు అమ్ముడు పోయినందకు నిలదీస్తాం.ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వోపైన దాడి చేస్తారా? దాడి చేసిన ఎమ్మెల్యేను రక్షిస్తారా?భూ తల్లిని అడ్డంగా తొవ్వేస్తే.ఆ తల్లి మిమ్మల్ని భూమిలోకి లాక్కెళ్తుంది.

జనసేన అభివృద్ధికి వ్యతిరేకం కాదు.ఆరేళ్లలో రూ.75 కోట్లు సంపాదించా.పాతిక కోట్లు ట్యాక్స్ కట్టా.సింగపూర్ తరహా రాజధాని కావాలంటే సింగపూర్ తరహా పాలన కావాలి.సింగపూర్‌లో మహిళా అధికారిపై దాడి చేస్తే ఆ వ్యక్తి తోలు ఊడిపోయేలా కొట్టేవాళ్లు.కాపులకు బీసీలకు మధ్య గొడవ పెట్టారు.ఎస్సీ కులాల మధ్య గొడవలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టింది. ప్రభుత్వ విధానాలతో సంఘంలో గొడవలు వస్తున్నాయి.

29 సార్లు చంద్రబాబుకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని చెబుతున్నారు.వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎలా అపాయింట్‌మెట్ ఇచ్చారు.
ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకొండి.జనసేనకు ఓటు వేయండి.జనసేన పార్టీని గెలిపించండి.దేవుడిపైన ప్రమాణం చేయమన్నా చేయండి.డబ్బులు తీసుకొండి.డబ్బులు పంచకూడదు కాబట్టి వాళ్లను దేవుడు క్షమించడు.ఆగస్టు 14న జనసేన పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తాం.

93940 22222 నంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే.మీరు జనసేన పార్టీ సభ్యులై పోతారు.మీకు నాకు మధ్య ఒక్క మిస్డ్‌కాలే దూరం.రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తా.అవసరమైతే కాదు.అవసరం పడుతుందనే నేను అనుకుంటున్నా.రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరూ బలిదానాలు చేయొద్దు. అవసరమైతే పవన్ కల్యాణే బలిదానం చేస్తాడు.ఈ రోజు నుంచి ఎప్పుడైనా నేను ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధం అంటూ పలు సంచలనవ్యాఖ్యలు చేశారు.

SHARE