THE BULLET NEWS (PAYAKARAOPET)-ప్లెక్సీలను కడుతూ నాగరాజు, శివ అనే ఇద్దరు జనసైనికులు మృతి చెందడం చాలా బాధగా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తనకు స్వాగతం పలికేందుకు ప్లెక్సీలు కడుతూ ఈ ఘటన జరగడం దురదృష్టకరమని… వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈరోజు పాయకరావుపేట బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఆ ఇద్దరి జనసైనికుల పిల్లలు ఒక వయసు వచ్చేంతవరకు వారి చదువుల భాధ్యత జనసేన పార్టీ చూసుకుంటుందని.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.

SHARE