డొక్కా సీతమ్మ గారి వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయం – జనసేన పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి…

184

లక్షలాదిమంది పేదలు,నిరాశ్రయులు,మరియు బాటసారుల ఆకలి తీర్చిన మహోన్నత వ్యక్తి డొక్కా సీతమ్మ అని నెల్లూరు సిటీ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నెల్లూరు నగరంలో భవన నిర్మాణ కార్మికులు అధికంగా ఉండే తడికల బజార్ సెంటర్, కొత్త హాల్ సెంటర్, జెండా వీధి సెంటర్, వెంకటేశ్వరపురం సెంటర్, తదితర ప్రాంతాలలో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు నిర్వహించారు.ఈ శిబిరాల ద్వారా దాదాపు రెండు వేల మందికి భవన నిర్మాణ కార్మికులకు ఆహారాన్ని అందించామని వారు తెలియ చేశారు.వినోద్ రెడ్డి మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన ఈ మహత్తర కార్యక్రమం లో భాగస్వాములు అవ్వడం తమ అదృష్టంగా భావిస్తున్నామని,ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి రుణపడి ఉంటామని ఆయన అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మత్తు వదిలి భవన నిర్మాణ కార్మికుల ఆదుకోవాలని, ఉపాధి కోల్పోయిన ఐదు నెలల కాలానికి గాను 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని, ఇసుక విధానాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల కోసం విధాన పరమైన లోపాల గురించి మాట్లాడుతుంటే వైసిపి నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదు అని హితవు పలికారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రపంచానికి తెలియజేయడంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించిందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనసేన అండగా వారికి ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఈ శిబిరాలలో ఆహారాన్ని స్వీకరించిన కార్మికులు పవన్ కళ్యాణ్ గారికి,వినోద్ రెడ్డి గారికి,ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు పావుజెన్ని చంద్ర శేఖర్ రెడ్డి,ఉడాలి సూర్య నారాయణ,కాకు మురళి రెడ్డి,సురేష్ నాయుడు, మహిళా నాయకులు, ఇందిరా రెడ్డి,షేక్ ఆలియా,శిరీషా,మోషే,కార్తిక్, రేవంత్,సారధి,రవి,ఆలీ, బాషా,కిరణ్ సుభాని,నరసింహ,షారూక్,వెంకట్,నాని,సాయి,తదితరులు పాల్గొన్నారు