ఆ కాలేజీలో విద్య‌న‌భ్య‌సిస్తే జాబ్ గ్యారెంటీ – న‌గ‌ర మేయ‌ర్ అబ్దుల్ అజీజ్

256

The bullet news (Kodavaluru)- శ్రీ వెంక‌టేశ్వ‌ర ఇంజనీరింగ్ కాలేజీలో చ‌దివితే జాబ్ గ్యారెంటీ అనే విధంగా విద్యార్దుల్లో వారి త‌ల్లిదండ్రుల్లో కాలేజీ మీద అపార‌మైన న‌మ్మ‌కంముంద‌ని నెల్లూరు న‌గ‌ర మేయ‌ర్ అబ్దుల్ అజీజ్ అన్నారు.. కొడ‌వ‌లూరు మండ‌లంలోని నార్తురాజుపాలెంలో ఉన్న శ్రీ వెంక‌టేశ్వ‌ర ఇంజ‌నీరింగ్ కాలేజీలో ప్లేస్ మెంట్ కు ఎంపికైన విద్యార్దుల‌తో స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు. కళాశాల చైర్మ‌న్ బాబూ నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి న‌గ‌ర మేయ‌ర్ అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ చ‌దువుతో పాటు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఇక్క‌డి కాలేజీ అధ్యాప‌కులు విద్యార్దుల‌కు నేర్పుతార‌న్నారు.. ప్ర‌స్తుతం ప్ర‌తి వ్య‌క్తి జీవితంతో ఇంజినీరింగ్ ఓ బాగ‌మైపోయింద‌న్నారు.. త‌ల్లిదండ్రుల‌ను, అధ్యాప‌కుల‌ను రోల్ మోడ‌ల్ గా ఎంచుకోవాల‌న్నారు.. కోర్సు పూర్త‌వ్వగానే ప్లేస్ మెంట్ క‌ల్పించ‌డం వెంక‌టేశ్వ‌ర్ ఇంజినీరింగ్ కాలేజీ ప్ర‌త్యేక‌త‌న్నారు.. ఎల్ జీ, ఐబీఓం, ఒరాకిల్ వంటి గొప్ప కంపెనీల్లో ఉద్యోగాలు పొంది కాలేజీకి, త‌ల్లిదండ్రుల‌ను మంచిపేరు తీసుకురావాల‌న్నారు.. చైర్మ‌న్ బాబూ నాయుడు మాట్లాడుతూ చిన్నత‌నం నుంచే ఓ ల‌క్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని కోసం కృషి చేయాల‌న్నారు.. ప్ర‌స్తుత‌మున్న కాలేజీల్లో వెంక‌టేశ్వ‌ర కాలేజీ మాత్రమే ప్ర‌తి సంవ‌త్స‌రం క్యాంప‌స్ సెలెక్ష‌న్స్ నిర్వ‌హిస్తోంద‌న్నారు.. అందులో భాగంగా ఈ ఏడాది జ‌రిగిన సెలెక్ష‌న్స్ లో దాదాపు 25 మంది ఉద్యోగాలు పొందడం త‌మ‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ ప్రియ‌త‌మ్ జ్యోతి, ప్రిన్సిపాల్ ద‌త్తాత్రేయ‌, హెచ్ వోడీలు కృష్ణ‌, ఏవో పాల్గొన్నారు..

SHARE