వెంక‌ట‌గిరిలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లో త‌గ్గిన జోష్…

344

The bullet news (Venkata Giri)_ ప్రజాసంక‌ల్ప యాత్ర పేరుతో జగన్  రాష్టవ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నప్ప‌టికీ ఆ నియోజకవర్గంలోనే వైసీపీ కేడర్ నిస్తేజంలో ఉండటానికి కారణాలేంటి..? నమ్మకమైన  కార్యకర్తలున్నా.. పార్టీ ఎందుకు బలోపేతం కావడం లేదు..? ఇన్ చార్జి మీద అసంతృప్తిగా ఉన్న‌దెవ్వ‌రు..? అధికార పార్టీ తప్పిదాలను క్యాష్ చేసుకోవడంలో ప్రతిపక్ష వైసీపీ ఎందుకు విఫలమవుతోంది..?  కొత్తముఖాలకు ఛాన్స్ ఉంటుందా..? ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది..?

  వెంకటగిరి నియోజకవర్గం… గత రెండు పర్యాయాలుగా ఇక్కడ సైకిల్ జోరు కొనసాగుతూనే ఉంది.. గత ఎన్నికల్లో  టీడీపీ అభ్య‌ర్ది కురుగొండ్ల రామ‌కృష్ణ‌పై వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన‌ కొమ్మి లక్ష్మయ్య  స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు.. ఎన్నికల అనంతరం కొమ్మి పొలిటికల్ గా సైలెంటయ్యారు..  ఈ తరుణంలో ఎంపీ మేకపాటి చక్రం తిప్పి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జిగా జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని రంగంలోకి దింపారు. అప్ప‌టి నుంచి బొమ్మిరెడ్డి ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు..
 బొమ్మిరెడ్డి ప్రజల్లో తిరుగుతున్నా పార్టీకి అనుకున్నంత మైలేజి రావడం లేదనేది స్వంత పార్టీ నాయకుల అభిప్రాయం..  బొమ్మిరెడ్డి వ్యవహారశైలిపై మండల స్థాయి నాయకులు గుర్రుగా ఉన్నారట‌. ఓ రూర‌ల్ నాయకుడితై తాను నిర్వహించే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు సైతం బొమ్మ‌రెడ్డిని, మేక‌పాటిని పిలిచేందుకు సైతం ఆస‌క్తి చూప‌డంలేద‌ట‌..   అంద‌రినీ క‌లుపుకుని పోకుండా కొంద‌రి మాట‌ల‌ను వింటూ మ‌రికొంద‌రిని దూరం పెడుతున్నార‌ని సొంత పార్టీ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. దానికి తోడు అంతర్గత విభేదాలు  పార్టీని దెబ్బతిస్తున్నాయని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ అధ్యక్షులు ఢిల్లీరావు, నక్కా వెంకటేశ్వరరావు, తోటా గిరిరెడ్డి, చిట్టేటి హరికృష్ణ, నెమల్లపూడి వంటి నాయకులు  పైకి బాగానే ఉన్నా వీరందరూ ఒక్కోవర్గాన్ని మెయిన్ టైన్ చేస్తున్నారట..  అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ వీళ్ల గ్రూపులతో మరింత దిగజారిపోతోందని  విమ‌ర్శ‌లు జోరుగా వినిపిస్తున్నాయి.. వైసీపీకి పట్టుకున్న కలువాయి వంటి మండలాల్లో అధికార పార్టీలోకి వెళ్తున్న వారుని బుజ్జగించడంలో బొమ్మిరెడ్డి ఫెయిల్యూర్ అయ్యార‌ని స్వంత కేడ‌ర్ యే అసంతృఫ్తిలో ఉంది.
అధికార పార్టీ వైఫల్యాలలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బొమ్మిరెడ్డి అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదనే విమర్శలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి..  అధికార పార్టీపై ప్ర‌జ‌లు అసంతృఫ్తిగా ఉన్నా వాటిని అస్త్రాలుగా చేసుకుని ప్రత్యర్దులపై పదునైన విమర్శలు సంధించడానికి కూడా బొమ్మిరెడ్డి సాహసించడం లేదట.. కొమ్మి లక్ష్మయ్యనాయుడు లాగా కష్టపడే తత్వం లేకపోవడం వల్ల పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోందని పాతతరం నాయకులు ఆందోళన  చెందుతున్నారు.. మరోపక్క  వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు కలిమిలి రామ్ ప్రసాద్ రెడ్డి, బిజెపి నేత రామ్ కుమార్ రెడ్డి లు సైతం టిక్కెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.. టికెట్ కోసం జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత ద్వారా వైసీపీ అధినేత జగన్ ను అప్రోచ్ అయినట్లు సమాచారం..  మ‌రో నాయ‌కుడు కలిమిలి రామ్ ప్రసాద్ రెడ్డి త‌న స్వంత నిధుల‌తో  నియోజకవర్గంలోని ఆరుమండలాల్లో ఆరు అంబులెన్స్ లు ఏర్పాటు చేశాడు.. దాంతో పాటు  వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేస్తూ  వైసీపీ తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. క‌లిమిలికి  వైసీపీతో పాటు అధికార టీడీపీలో కూడా మంచిపేరుంది.. టీడీపీలో కూడా ఆయనకు అనుచరగణం ఉండటంతో ఆయన కూడా రేస్ లు ఉన్నట్లు తెలుస్తుంది.. పీకే టీం కూడా  బొమ్మిరెడ్డి కి ప్రతికూలంగా నివేదికను అధిష్టానానికి అందజేసినట్లు వైసిపి వర్గాల టాక్.. ఇప్ప‌టికైనా మేల్కోకపోతే రానున్న రోజుల్లో   వెంక‌ట‌గిరిలో వైసీపీ మరోసారి బొక్కబోర్లా పడే అవకాశాలున్నాయని విశ్లేషకుల అభిప్రాయం..
SHARE