అగ్నిప్రమాద బాధితులకు సోమిరెడ్డి రాజగోపాల్ పరామర్శ

123

The bullet news ( SARVEPALLI)_ ముత్తుకూరు మండలం మామిడిపూడి దళితవాడలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోయి సర్వం కోల్పోయిన బాధితులు బల్లెం ఆదెమ్మ, బల్లెం శ్యామలమ్మ కుటుంబాలను సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త శ్రీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీయడంతో పాటు అన్నివిధాలుగా అండగా ఉంటామని బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వసాయం త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితులైన రెండు కుటుంబాల వారికి ఆర్థికసాయం అందజేశారు.

SHARE