కళ్లుండి కబోదుల్లా విద్యాశాఖాధికారులు – ఏబీవీపి నాయకుడు మనోజ్ మండిపాటు..

88

The bullet news (Gudur)-  సెలవు దినాల్లో తరగతుల నిర్వహణపై గూడూరులో ఏబీవీపి నాయకులు మరోసారి ఆందోళనకు దిగారు. విద్యాశాఖాధికారుల వ్యవహారశైలి, ప్రయివేట్ విద్యాసంస్థల తీరుపై ఇవాళ గూడూరు డివిజన్ కన్వీనర్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.. విద్యార్దులను మానసిక ఒత్తిడి గురిచేస్తూ ఆదివారం తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర భారతిలో జరుగుతున్న పరీక్షను అడ్డుకున్నారు.. విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం, వ్యవహారశైలిపై మనోజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. విద్యార్దుల గురించి
పట్టించుకోవాల్సిన విద్యాశాఖాధికారులు ప్రయివేట్ విద్యా సంస్థలతో కుమ్మకై కళ్లుండి కబోధిలా వ్యవహరిస్తున్నారని
మండిపడ్డారు.. యాజమాన్యాల ఆటకట్టించాల్సి విద్యాశాఖాధికారులే వారితో చీకటి స్నేహాలు చేస్తున్నారని ఆయన
ఆరోపిస్తున్నారు. డిఈవో, ఆర్ ఐవోలు కుంభకర్ణ నిద్రను వీడి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని మనోజ్ డిమాండ్
చేశారు.. లేని పక్షంలో ఏబీవీపి ఆద్వర్యంలో ఆందోళన ఉద్రుతం చేస్తామన్నారు..

SHARE