మానస సరోవర్‌ యాత్రకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్…

121

THE BULLET NEWS (UTTARAKHAND)-కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రను విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ ప్రారంభించారు. తొలి బ్యాచ్‌ కింద 58 మంది యాత్రికులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్  ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్‌ ద్వారా వీరు కైలాస్‌ మానస సరోవర్‌కు చేరుకుంటారు. యాత్రికులతో పాటు వారి మంచి చెడ్డలు చూసేందుకు ఇద్దరు అధికారులను కేంద్రం పంపుతోంది. ఈ యాత్ర మార్గాలపై స్పష్టమైన అవగాహన ఉన్నవారినే దీనికి ఎంపిక చేస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 60 మంది ఉండేలా ప్రభుత్వం చూస్తోంది. మొత్తం 18 బ్యాచులను పంపుతారు. 24 రోజుల ఆ యాత్ర క్లిష్టమైన హిమాలయ ప్రాంతం గుండా సాగుతుంది. ఒక్కో యాత్రికుని నుంచి ప్రభుత్వం రూ 1.6 లక్షలు వసూలు చేస్తోంది. సిక్కింలోని నాథూ లా పాస్‌ ద్వారా కూడా యాత్రికులు కైలాస్‌ మానస సరోవర్‌కు చేరుకుంటారు. సులభంగా ఉండే ఈ మార్గం గుండా వృద్ధులను పంపుతారు.

SHARE