ఆ ఊరంతా ఆయ‌న ఫ్లెక్సీలే… క‌ట్ట‌లు తెచ్చుకుంటున్న అభిమానం

236

THE BULLET NEWS (VENKATAGIRI)-ఆ ఊరుకు వెళితే ఎటు చూసినా, అయ‌న ఫ్లెక్సీలే క‌నిపిస్తాయి. ఎవ‌రి నోట విన్న ఆయ‌న మాటే వినిపిస్తుంది. ఆయ‌న ఎవ‌రో కాదు దింగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వీరాభిమాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి న‌మ్మిన బంటు, మ‌దినిండా వైఎస్ కుటుంబాన్ని నింపుకున్న నాయ‌కుడు క‌లిమిలి రాంప్ర‌సాద్ రెడ్డి క‌ట్ట‌లు తెంచుకుంటున్న అభిమానం
సాధార‌నంగా ఎవ‌రికైనా ఒక‌రో ఇద్ద‌రో, లేక పోతే 10 మందో ప్లెక్సీలు వేస్తుంటారు. కానీ వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఎటు చూసినా క‌లిమిలి రాంప్ర‌సాద్ రెడ్డి ఫ్లెక్సీలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. స్థానిక ప్ర‌జా నాయ‌కుల ఫ్లెక్సీలు అక్క‌డో ఇక్క‌డో క‌నిపిస్తుంటే, క‌లిమిలి ఫ్లెక్సీలు మాత్రం ఎక్క‌డైనా క‌నిపిస్తూనే ఉన్నాయి. రాజ‌కీయాల్లో ఆయ‌న లేక‌పోయినా, ఆయ‌న చేస్తున్న ప్ర‌జా సేవ‌కు నిద‌ర్శ‌నంగా ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఎంతో మంది క‌లిమిలి సేవ‌లు పొందిన వారు, ఆయ‌న సేవ‌ల్లో బాగ‌స్వాములు అవుతున్న వారు స్వ‌త‌హాగా, సొంత నిధుల‌తో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి త‌మ అభిమానం చాటుకుంటున్నారు.
యువ‌తే ఎక్కువ‌. ఏ కార్య‌క్ర‌మం అయినా విజ‌య‌వంతం కావాలంటే అందులో యువ‌త పాత్ర కీల‌కంగా ఉంటుంది. దానిని గ్ర‌హించిన క‌లిమిలి రాంప్ర‌సాద్ రెడ్డి, యువ‌త‌కు అధిక ప్రాధ‌న్య‌త ఇస్తున్నారు. త‌ను చేసే సేవా కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు యువ‌త‌ను ప్రోత్సాహిస్తున్నారు. వెంక‌ట‌గిరిలో ఓ యువ‌సైన్యం ఏర్పాటు చేసుకుని, త‌న‌దైన శైలిలో ముందుకుసాగుతున్నారు. అందుకే వెంక‌ట‌గిరి అంతా ఆయ‌న ఫ్ల‌క్సీలే క‌నిపిస్తున్నాయి.

SHARE