సమాజ న్యాయ ప్రచార సమితి జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలిగా కల్యాణి ఎన్నిక…!

236

The Bullet News ( Nellore ) _
సమాజ న్యాయ ప్రచార సమితి జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలిగా మేరగడ కల్యాణిని ఏకగ్రీవంగా ఎన్నికున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పాల రఘు తెలిపారు.. ఇవాళ జిల్లా కార్యాలయంలో కల్యాణికి నియామక పత్రాలు అందజేశారు.. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. ఎస్సి, ఎస్టీ చట్టాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.. కల్యాణి మాట్లాడుతూ జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తానన్నారు.. మహిళ హక్కుల కోసం సమాజ న్యాయ ప్రచార సమితి నిరంతరం పోరాటం సాగిస్తామని కల్యాణి అన్నారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి బొడ్డు మధుసుధన్ రావు,జిల్లా అధ్యక్షుడు కుడారి బాలకృష్ణ తదితరులు ఉన్నారు. అనంతరం కల్యాణి ఆధ్వర్యంలో వేదాయపాలెం సిఐ నరసింహ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఎస్సి, ఎస్టీ చట్టాలపై అవగాహన కలిపించాలని కోరారు..