కట‌క‌టాల్లో కంత్రీ ఖాకీ..

169

The bullet news (Gudur)_  ఖాకీ డ్ర‌స్స్ ను కంత్రీప‌నుల‌కు వాడుకున్నాడు ఆ పోలీస్ ఉన్న‌తాధికారి.. ఫ్యామిలి ప్రెండ్ కే టోక‌రా వేసేందుకు సిద్ద‌మ‌య్యాడు.. కోట్ల రూపాయాలు దండుకుని సైలెంట‌య్యాడు.. అనుమానం వ‌చ్చిన బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో కంత్రీ ఖాకీతో పాటు మ‌రో న‌లుగురు క‌ట‌క‌టాల‌పాల‌య్యారు..

గూడూరు నెహ్రూన‌గ‌ర్ కు చెందిన ర‌మ‌ణ‌య్య నాయుడుకు పేస్ బుక్ ద్వారా ల‌క్ష్మీ ప్ర‌స‌న్న అనే మ‌హిళ ప‌రిచయ‌మైంది.. ప్యామిలి ప్రెండ్ అయిన త‌ర్వాత రాజ‌ధానిలో భూములు కొనుక్కొనేందుందుకు ర‌మ‌ణ‌య్య ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని తెలుసుకున్న ల‌క్ష్మీ ప్ర‌స‌న్న త‌మ భూములున్నాయ‌ని అమ్ముతామంటూ న‌మ్మ‌బ‌లికి అత‌ని వ‌ద్ద కోట్ల రూపాయ‌లు కాజేశారు.. రిజిస్టేష‌న్ చేసుకుందామ‌ని ర‌మ‌ణ‌య్య అడిగిన ప్ర‌తిసారి దాటేస్తు వ‌చ్చారు.. ఇలా ర‌మ‌ణ‌య్య‌వ‌ద్ద రూ. 4.5 కోట్ల మేర దండుకున్నారు. ఆయ‌న‌తో పాటు అత‌ని స్నేహితుడైన ఓ డాక్ట‌ర్ ను కూడా బాదేశారు.. రాష్ట‌ప‌తి ద్వారా ప‌ద్మ‌శ్రీ అవార్డు ఇప్పిస్తానంటూ ఆయ‌న వ‌ద్ద కూడా లక్ష‌ల్లో పిండుకున్నారు.. అవార్డు వ‌చ్చేసిందంటూ న‌కిలీ ప‌త్రాలు సృష్టించి మోసం చేయాల‌ని చూశాడు.. దీంతో అనుమానం వచ్చిన డాక్ట‌ర్ ప‌త్రాల గురించి ఆరా తీయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.ఈ విష‌యం డాక్ట‌ర్ ర‌మ‌ణ‌య్య‌కు చెప్ప‌డంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన ర‌మ‌ణయ్య గూడూరు వ‌న్ టౌన్ సిఐను ఆశ్ర‌యించారు.. . వీరిద్దని మోసం చేయడంలో సిఐ కాకారావు తెరవెనుక నుంచి లక్ష్మీ ప్రసన్నను నడిపించాడు. దీంతో విచారించిన సిఐ ఐదుగురు నిందితుల‌ను క‌ట‌క‌టాల వెన‌క్కి పంపారు..

SHARE