The bullet news (Atmakur)- వాళిద్దరూ ఒకే పార్టీ.. ఒకరేమో రాష్ట రాజకీయాలతోపాటు జిల్లా రాజకీయాలను శాసించిన నేత.. మరొకరు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టి ప్రజల్లోకి   వాళిద్దరూ ఒకే పార్టీ.. ఒకరేమో రాష్ట రాజకీయాలతోపాటు జిల్లా రాజకీయాలను శాసించిన నేత.. మరొకరు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టి ప్రజల్లోకి
వెళ్లిన నాయకుడు.. వీరిద్దరూ ప్రస్తుతం అధికార టీడీపీలో నేతలుగా ఉన్నారు.. కానీ వీరిద్దరి మద్య ఇంటర్నెల్ వార్ టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.. ఇంతకీ  మాజీ మంత్రికే చుక్కులు చూపిస్తున్న నేతెవరు..? పొమ్మనకుండానే పొగ పెడుతున్నదెవరు..?  ఈ క్వశ్చన్స్ కు క్లారిటీ రావాలంటే ఈ కథనంపై ఓ లుక్కెయ్యండి..

ఆత్మకూరు నియోజకవర్గం.. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జిగా
కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం  ఆనం టీడీపీ కండువా కప్పుకోవడంతో అప్పటి దాకా ఇన్ చార్జిగా ఉన్న గుటూరు కన్నబాబును కాదని ఆయనికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. పదేళ్ల పాటు ఆనంతో పోరాటం చేసిన ఇక్కడి తెలుగుదేశం నాయకులకు రామనారాయణరెడ్డి రాక  ఏమాత్రం ఇష్టం లేదు. కాకపోతే అధినేత ఆదేశించారు.. తాము పాటించాలి అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు..

కొన్నాళ్ల పాటు సయోధ్యగా కనిపించిన ఆనం, కన్నబాబు వర్గాలు ఇటీవల ఆదిపత్య పోరాటానికి తెరలేపాయి. నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు తీసుకున్న ఆనం తన మార్క్ రాజకీయాలకు తెరలేపారు. గతంలో ఉన్న జన్మభూమి కమిటీలను దాదాపుగా రద్దు చేసేశారు.. ఇందులో అప్పటి వరకు ఇన్ చార్జిగా, టీడీపీ నేతగా ఉన్న  గూటూరు కన్నబాబు వర్గానికి చెందిన 72 మందికి జన్మభూమి కమిటీల నుంచి ఉద్వాసన పలికారు.. అప్పటికే ఇన్ చార్జి పదవి పోయి రుసరుసలాడుతున్న కన్నబాబుకి ఈ పరిణామం మూలిగే నక్కపై తాటికాయపడ్డనట్లుగా తయారైంది.. ఇక్కడే  పోరు మొదలైంది..

జన్మభూమి కమిటీల్లో కన్నబాబు వర్గాన్ని తొలగించడంతో గ్రామాల్లో టీడీపీ వర్సెస్ టీడీపీగా మారింది.. ఒకే పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.. దీంతో తమ వర్గాన్ని జన్మభూమి కమిటీ లనుంచి తీసేయడాన్ని తీవ్రంగా పరిగణించిన కన్నబాబు వర్గం హైకోర్టును ఆశ్రయించింది.. దీంతో కోర్టు జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆనం వర్గానికి చెందిన   సుమారు  70 కోట్ల రూపాయల  పనులు  పెండింగ్ లో పడ్డాయి.. ఈ పరిణామం ఆనంకి అరికాల్లో మండేలా చేసింది.. మొన్న వెంకటగిరిలో జరిగిన సమన్వయ కమిటీలో ఆనం అలకబూనారు..

నెల్లూరులో జరిగిన జిల్లా స్థాయి మీటింగ్ కు ఆనం వ‌ర్గం దూరమైంది.. చివరికి ఆ నియోజకవర్గంలోని సంగం వద్ద పెన్నానదికి జరిగిన జలహారతికి ఆనం కారణాలు చూపుతూ దూరమయ్యారు..  ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్న తెలుగుదేశం వర్సెస్ తెలుగుదేశం రాజకీయ వివాదాన్ని సర్దుబాటు చేయలేక అధిష్టానం సైతం తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం.. జిల్లాలో కన్నబాబుకు మంత్రి సోమిరెడ్డి, జలవనరులశాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు సహా పలువురు ఆ సామాజిక
వర్గానికి చెందిన నేతలు సపోర్టుగా ఉన్నారు.. ఆనం మాత్రం ఒంటరి పోరు సాగిస్తున్నారు.

SHARE