క‌లియుగ క‌ర్ణుడు

201

THE BULLET NEWS – దేవుడిచ్చిన ఓ అద్భుత‌మైన వ‌రాల్లో దానం గుణం ఓ ఉన్న‌త‌మైన‌ది. ఈ గుణం అంద‌రికీ ఉండ‌దు. ఈ గుణం క‌లిగిన వారు నిజంగా అదృష్ట‌వంతులు. దానం చేయాల‌నే త‌ప‌న‌, ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకోవాల‌న్న ఆలోచ‌న, స‌మాజానికి మేలు చేసేవి. త‌న పుట్టుక‌కు ఓ ప‌ర‌మార్థం వెతుక్కుంటూ… అంద‌రూ ఆనందంగా ఉండాల‌ని ప‌రితంపించే వారు నిజంగా క‌లియుగ క‌ర్ణులు. అటువంటి క‌లియుగ క‌ర్ణుడు సింహ‌పురి సీమ‌లో ఉండ‌టం నిజంగా ఓ అదృష్టం.

క‌లియుగ క‌ర్ణుడు క‌లిమిలి
చ‌రిత్ర పుట‌ల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం క‌లిగి, ఎంతో మంది రాజుల ఏలుబ‌డిలో ఉండిన ప్రాంతం వెంక‌ట‌గిరి ప‌ట్ట‌ణం. అటువంటి చ‌రిత్రకెక్కిన ఆ ఊరిలో చ‌రిత్ర సృష్టించే ద‌యార్థ‌హృద‌యుడిగా, జ‌నం మ‌దిలో చెర‌గ‌ని ముద్ర‌వేసుకున్నారు క‌లిమిలి రాంప్ర‌సాద్ రెడ్డి.  ఆయ‌న సంపాదించే ప్ర‌తి రూపాయి ప‌రుల బాగుకోసం, పేద‌వారి అభ్యున్న‌తి కోసం, ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకునేందుకోసం వెచ్చిస్తున్నారు. నిస్వార్థ ప్ర‌జాసేవ‌లో కొన‌సాగుతున్నారు.
క‌లిమిలి సేవ‌లు
అంద‌రూ ప్ర‌జా సేవ చేస్తుంటారు. కానీ ఆ సేవ‌లో స్వార్థం దాగి ఉండ‌వ‌చ్చు. లేక‌పోవ‌చ్చు. అధిక శాతం మంది స్వార్థం కోస‌మే సేవ చేస్తున్నారు. కాని సేవ‌గుణంలో క‌లికితురాయిలాంటి వారు అతి అరుదుగా ఉంటారు. అటువంటి సేవా క‌లికితురాయి క‌లిమిలి రాంప్ర‌సాద్ రెడ్డి. వెంక‌ట‌గిరి ప‌రిధిలోని డ‌క్కిలి మండ‌లం చాప‌ల‌ప‌ల్లి గ్రామంలో క్రిష్ణారెడ్డి, ప్ర‌మీల‌మ్మ దంప‌తుల‌కు జ‌న్మించిన క‌లిమిలి రాంప్ర‌సాద్ రెడ్డి చిన్న‌త‌నం నుంచి తాను బాగుండాలి, త‌న‌తోపాటూ అంద‌రూ బాగుండాల‌న్న గుణాన్ని అల‌వ‌రుచుకున్నారు. చిన్న‌త‌నంలో త‌న మ‌న‌స్సులో ప‌డిన ఆ భావాన్ని పెంచుకుంటూ సేవా గుణానికి మారుపేరుగా నిలిచారు. నిలుస్తున్నారు. క‌లిమిలి రాంప్ర‌సాద్ రెడ్డి చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్‌ను ఏర్పాటు చేసిన ఆయ‌న ముందుగా త‌న గ్రామంపై దృష్టి పెట్టి, ఆ గ్రామంలో రోడ్లు, త్రాగునీటి వ‌స‌తిని త‌న సొంత నిధుల‌తో ఏర్పాటు చేశారు. అంతేకాదు ధ‌నం క‌న్నా గొప్ప‌దైన ఆరోగ్యాన్ని కాపాడేందుకు త‌న‌దైన శైలిలో ముందుకువెళుతున్నారు క‌లిమిలి. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అంటే అమిత‌మైన అభిమానం, ఆయ‌న త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అంతే ఎన‌లేని ప్రేమ క‌లిగిన క‌లిమిలి రాంప్ర‌సాద్‌రెడ్డి, త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి మండ‌లంలో అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ అత్య‌వ‌స‌రంగా ఆసుప‌త్రికి వెళ్లాలంటే ఇబ్బందిప‌డుతున్నార‌ని గ్ర‌హించి, మండలానికి ఓ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 6అంబులెన్స్‌ల‌ను త‌న సొంత నిధుల‌తో న‌డుపుతున్నారు. అంతేకాదు గ్రామాల్లో ఉచిత వైద్య‌శిబిరాలు నిర్వ‌హిస్తూ, జ‌నం గుండెల్లో గూడుక‌ట్టుకున్నారు. క‌లిమిలి చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా త‌న సేవా సామ్రాజ్యాన్ని విస్త‌రింప‌జేసుకుంటున్నారు. అంతేకాదు గ్రామీణ ప్ర‌జ‌లు స్వ‌చ్చ‌మైన మంచినీరు తాగాల‌ని, అందుకోసం అనేక గ్రామాల్లో వాట‌ర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసి, ప‌ల్లెవాసుల దాహార్తిని తీరుస్తున్నారు. ఇక ఆప‌ద‌లో ఉన్న‌వారు త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చి త‌న బాధ‌లు చెప్పుకోగానే వెన్న‌వ‌లె క‌రిగిపోయే క‌లిమిలి, వారికి త‌న‌దైన స‌హాయం అందిస్తూ వారి ప‌ట్ల ఆప‌ద్భాంద‌వుడిలా నిలుస్తున్నారు. ఇలా సేవా సామ్ర‌జ్య‌పు రారాజుగా వెంక‌ట‌గిరిలో వెల‌గొందుతున్న క‌లిమిలి, క‌లియుగ క‌ర్ణుడిగా కీర్తింప‌బ‌డుతున్నారు
నాయ‌కులెంద‌రున్నా… క‌లిమిలే నిజ‌మైన నాయ‌కుడు …!వెంక‌ట‌గిరిలో నాయ‌కులెంద‌రున్నా.. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తూ, త‌న‌కంటూ ప్ర‌జ‌ల్లో స్థానం సంపాదించుకున్న క‌లిమిలి రాంప్ర‌సాద్ రెడ్డే త‌మ‌కు నిజ‌మైన నాయ‌కుడ‌ని స్థానికులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించ‌క‌పోయినా ఆయ‌నే మా నాయ‌కుడ‌ని, త‌మ బాధ‌ల‌ను తెలుసుకుని వాటిని తీరుస్తూ, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న క‌లిమిలే నిజ‌మైన ప్ర‌జా నాయ‌కుడని చెబుతున్నారు యువ‌త కోసం క‌లిమిలి దేశానికి శ‌క్తి, ఓ భ‌రోసా యువ‌త‌రం. అటువంటి యువ‌త‌రం తెలిసోతెలియ‌కో అనేక త‌ప్పిదాలు చేస్తూ ఉంటుంది. చాలా మంది యువ‌త తాత్క‌లిక ఆక‌ర్ష‌ణ‌ల‌కు లోనై చెడు అల‌వాట్ల‌కు బానిసై త‌మ జీవితాల‌ను చిద్రం చేసుకుంటుంటారు. దీనిని గ్ర‌హించిన క‌లిమిలి రాంప్ర‌సాద్ రెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని యువ‌త‌కు వెన్నుద‌న్నుగా, వారు స‌మాజానికి మేలు చేసే వారుగా తీర్చిదిద్దాల‌ని సంక‌ల్పించారు. అందుకే యువ‌త‌ను ప్రోత్సాహిస్తూ ,వారిని చెడు అల‌వాట్ల‌కు దూరం చేస్తూ, అనేక క్రీడా పోటీల‌ను నిర్వ‌హిస్తున్నారు. క్రికెట్ టోర్న‌మెంట్‌లు ఏర్పాటు చేసి యువ‌త‌లో నూత‌న ఉత్సాహం నింపుతున్నారు క‌లిమిలి రాంప్ర‌సాద్ రెడ్డి. త‌న సొంత నిధుల‌తో క్రీడాకారుల‌కు అవస‌ర‌మైన క్రీడా ప‌రిక‌రాలు అందించ‌డ‌మేకాకుండా అనేక పోటీల‌తో వారికి వెన్నుద‌న్నుగా నిలుస్తున్నారు. పార్టీల‌క‌తీతంగా సేవ‌లు క‌లిమిలి రాంప్ర‌సాద్ రెడ్డి ఓ పార్టీకి చెందిన వ్య‌క్తి కాదు.  ఆయ‌న పార్టీ ప్ర‌జా పార్టీ. ప్ర‌జ‌లే ఆ పార్టీలో నేత‌లు, స‌భ్యులు, కార్య‌క‌ర్త‌లు. అన్నీ పార్టీల‌కు చెందిన వారితో మంచి సంబంధాలు క‌లిగిన క‌లిమిలి, ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకుంటుంటారు. పేద వాడి ఇంటిలో శుభ‌కార్యం జ‌రిగినా, అశుభ కార్యం జ‌రిగినా అక్క‌డకు వెళ్లే క‌లిమి త‌న‌సేవా గుణాన్ని చాటుకుంటారు. పేద‌వాడి ఇంట ఆనందం నిండాల‌ని ఆకాక్షించే క‌లిమిలి వారికి తోచినంత సాయం చేస్తారు. నిరుపేద ఇంటిలో ఎవ‌రైన మ‌ర‌ణిస్తే ఆ ఇంటిని వెతుకుంటూ వెళ్లి వారిని ప‌రామ‌ర్శించి ఆర్థిక భ‌రోసా క‌ల్పిస్తారు. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గ పేద, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జల‌కు క‌లిమిలి రాంప్ర‌సాద్ రెడ్డి భ‌గ‌వంతుడు ఇచ్చిన వ‌రం. ఆయ‌నలోని సేవా గుణం ఎంతో మంది జీవితాల‌కు వెలుగు ఇస్తోంది. అటువంటి సేవా గుణానికి ప్ర‌తీక‌గా క‌లియుగ క‌ర్ణుడిగా నియోజ‌క‌ర్గ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు అందుకుంటున్న ఆయ‌న భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సేవా కార్య‌క్ర‌మాల‌తో జ‌నంలో చిర‌స్థాయిగా నిలిచిపోవాల‌ని కోరుకుందాం.
SHARE