కౌర‌వుల‌కు ప‌ట్టిన గ‌తే చంద్ర‌బాబుకు కూడా ప‌డుతుంది – వైసీపీ నెల్లూరుజిల్లా అధ్య‌క్షులు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి

108

The bullet news (Hyderabad)- జూదంలో గెలిచి విర్ర‌వీగిన కౌర‌వులు చివ‌రికి కురుక్షేత్రంలో భూ స్థాపితం అయిన‌ట్లే నంద్యాల గెలుపుతో విర్ర‌వీగుతున్న తెలుగుదేశం పార్టీని 2019 ఎన్నిక‌ల్లో భూ స్థాపితం చేసేందుకు రాష్ట ప్ర‌జ‌లు సిద్దంగా ఉన్నార‌ని స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే, వైసీపీ నెల్లూరుజిల్లా అధ్య‌క్షులు కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి అన్నారు.. లోట‌స్ పాండ్ లో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న చంద్ర‌బాబు నాయుడి వ్య‌వ‌హార‌శైలిపై మండిప‌డ్డారు.. ఆల్ ఖైదా ఉగ్ర‌వాదుల‌కు ట్రైనింగ్ ఇచ్చిన‌ట్లు తెలుగు త‌మ్ముళ్ల‌కు శిక్ష‌ణ‌నిచ్చి నంద్యాల‌లో ఓట‌ర్ల‌ను బెదిరింపుల‌కు గురి చేసి గెలిచార‌న్నారు.. నంద్యాల‌లో గెలుపును చూసి చంద్ర‌బాబు నాయుడు విర్ర‌వీగుతున్నార‌ని అది వాపు మాత్ర‌మేన‌న్న విష‌యాన్ని బాబు గుర్తుంచుకోవాల‌న్నారు.. అబ‌ద్దాల‌తో రాష్ట ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు నాయుడు మ‌భ్య పెట్టాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించారు.. అబ‌ద్దాలు ఆడ‌టంలో కూడా ఆస్కార్ ఆవార్డు ఇచ్చే అవ‌కాశ‌ముంటే దానికి మొట్టమొద‌టి అర్హుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడేన‌ని ఎద్దేవా చేశారు. రియ‌ల్ టైమ్ పాలిటిక్స్ కు చేస్తాన‌న్న వ్యాఖ్య‌ల‌పై కాకాణి చుర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది రియ‌ల్ టైమ్ పాలిటిక్స్ కాదా అంటూ ప్ర‌శ్నించారు.. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్ట్‌ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్ర‌శ్నించారు.. ఓటుకు నోటు కేసుకు భ‌య‌ప‌డి తెలంగాణ ప్రాజెక్టుల‌పై మాట్లాడే దైర్యం లేని చంద్ర‌బాబుకు జలసిరికి హారతిచ్చే అర్హత ఉందా..? అంటూ ప్ర‌శ్నించారు.. 2019లో వైసీపీ అధికారంలోకి రాబోతుందంటూ ధీమా వ్య‌క్తం చేశారు.

SHARE