కావలి వైద్యుల నిర్లక్ష్యానికి మగ శిశువు మృతి

142

The bullet news ( Kavali) _ వైద్యుల నిర్లక్ష్యానికి పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు.. లోకం కూడా చూడని చిన్నారులను పరలోకానికి పంపుతున్నారు.. నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.. కావ్య అనే మహిళ కాన్పు కోసం కావలి ఏరియా హాస్పటల్లో లో చేరింది.. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు కాన్పు చేశారు.. ఈ సమయంలో మగ శిశువు మృతి చెందింది.. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పండంటి మగబిడ్డ చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. ఈ హాస్పటల్ లో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.. ఈ ఘటనకు కారణమైన వారి పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు..

SHARE