సీఎం అండదండలు. ప్రజలు సహకారం ఉంటే ఉదయగిరి నుంచే పోటీ చేస్తా – కావ్య క్రిష్ణారెడ్డి.

92

THE BULLET NEWS (KAVALI):-ప్రజలకు సేవ చేయాలనే ట్రస్ట్ ఏర్పాటు చేశా.. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల రుణం తీర్చుకుంటా.. పార్టీని బలోపేతం తిరుగులేని శక్తిగా బలోపేతం చేస్తానంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త, తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గుమాటి క్రిష్ణారెడ్డి అన్నారు.. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన తన ఆలోచనలను, ఆశయాలను పంచుకున్నారు.. తన పురిటిగడ్డైన ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు ఛారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తనకు చదువు విలువ బాగా తెలుసన్నారు.. అందుకే ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు నడుం బిగించానన్నారు.. ఉదయగిరి ప్రాంతాల్లో క్లోరిన్ సమస్య వల్ల ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారని, వారికి శాశ్వత పరిష్కారానికి ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.. నియోజకవర్గం లో 146 పంచాయతీల్లో 458 పాఠశాలలో 34, 500 పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేస్తామన్నారు.. ఎంపీపీగా రాజకీయ జీవితం ఇచ్చిన జలదంకి మండలం ఉదయగిరి నియోజకవర్గంలో వుంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఆదినాయకత్వం ఆదేశిస్తే ఇక్కడ నుండే పోటి చేస్తానని తన మనస్సులోని మాటను అధిష్టానానికి చేరవేశారు..

SHARE