కావలి లో రిటైర్ టీచర్ దారుణ హత్య..

315

THE BULLET NEWS (KAVALI)-నెల్లూరుజిల్లా కావలిలో దారుణం జరిగింది.. ఒంటరిగా ఉన్న ఓ మహిళలను కిరాతకంగా హత్య చేశారు. ఆనవాళ్లు దొరక్కుండా కారం చల్లి దుండగులు పరారయ్యారు. ఎప్పుడూ రద్దీగా ఉండే కచేరి మిట్లలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది..

కావలి కచేరి మిట్లలో నివసిస్తున్న రిటైర్డు ఉపాధ్యాయుని జయలక్ష్మి (65)ని గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. అర్దరాత్రి సమయంలో ఇంటిలోకి ప్రవేశించిని దుండగులు జయలక్ష్మిని తలపై మోడి హత్య చేశారు. ఇవాళ ఉదయం నుంచి ఆమె ఫోన్ పనిచేయకపోవడంతో ఆమె కుమారులు, కుమార్తెలు ఇరుగుపొరుగువారికి సమాచారమిచ్చి పరిశీలించమని చెప్పడంతో ఈ దారుణం వెలుగు చూసింది.. జయలక్ష్మికి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.. ఉద్యోగ రిత్యా బయట ప్రాంతాల్లో ఉండగా ఆమె ఒంటరిగా జీవిస్తోంది.. పథకం ప్రకారమే దుండగులు జయలక్ష్మిని హత్య చేసినట్లు ఆనవాళ్లున్నాయి.. దర్యాప్తు సంస్థలు, డాగ్ స్క్కాడ్ పరిశీలనకు అందకుండా ఘటనా ప్రదేశంలో కారం చల్లి ఇంట్లో ఉన్న నగలు, నగదు సహా విలువైన వస్తువులను దోపిడి చేశారు. జయలక్ష్మి నివాసంలో దుండగులు ఎంత అపహరించారన్న విషయం తెలియాల్సి ఉంది.. సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

SHARE