ఊహించని అడుగు వేసిన కేసీఆర్…

147

THE BULLET NEWS (TELANGANA):-టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు మామూలుగా లేదు. ఊహించని విధంగా అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ మరో ఊహించని అడుగు వేశారు. ప్రతిపక్షాలు సైతం విస్మయం చెందేలా ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ భవన్ లో జరుగుతున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 105 మంది ఎమ్యెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు.

ఆందోల్, చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ స్థానాలను పెండింగ్ లో ఉంచామని చెప్పారు. మిగిలిన అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వారి సీట్లను వారికే కేటాయించడం జరిగిందని చెప్పారు. సిట్టింగ్ లను మార్చబోమని గతంలోనే చెప్పానని… చెప్పినట్టుగానే అందరికీ సీట్లను ఇస్తున్నామని చెప్పారు. కొన్ని చోట్ల చిన్నచిన్న సమస్యల కారణంగా కొందరికి తొలి జాబితాలో సీట్లను కేటాయించలేకపోయామని చెప్పారు. 15 సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు.

గజ్వేల్ కేసీఆర్

సిరిసిల్ల కేటీఆర్

సిద్ధిపేట హరీశ్ రావు

భధ్రాచలం డా. తెల్లం వెంకట్రావు

పినపాక పాయం వెంకటేశ్వర్లు,

అశ్వారావుపేట తాటి వెంటకేశ్వర్లు

ఇల్లందుకు కోరం కనకయ్య

కొత్తగూడెం జలగం వెంకట్రావు

ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్

పాలేరు తుమ్మల నాగేశ్వరావు

వైరా బానోతు మదన్ లాల్

మధిర లింగాల కమల్ రాజ్

సత్తుపల్లి పిడమర్తి రవి

మహబూబ్ నగర్ శంకర్ నాయక్

డోర్నకల్ రెడ్యానాయక్

పరకాల చల్లా ధర్మారెడ్డి

నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సన్నపేట ఆరూరి రమేశ్

వరంగల్ పశ్చికు దాస్యం వినయ్ భాస్కర్

భూపాలపల్లి మధుసూదనాచారి

ములుగు చందూలాల్

జనగాం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

స్టేషన్ ఘన్ పూర్ తాటికొండ రాజయ్య,

వేములవాడ చెన్నమనేని రమేశ్

ఇల్లందు కోరం కనకయ్య

చెన్నూరు బాల్క సుమాన్

పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్ రావు

సంగారెడ్డి చింతా ప్రభాకర్

నారాయణ్ ఖేఢ్ భూపాల్ రెడ్డి

కరీంనగర్ గంగుల కమలాకర్

హుజూరా బాద్ ఈటల రాజేందర్

మానుకొండ రసమయి బాలకిషన్

జగిత్యాల సంజయ్ కుమార్,

కోరుట్ల కె. విద్యాసాగర్ రావు

ధర్మపురి కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి రాసరి మనోహర రెడ్డి

మంథని సుట్టా మధు

రామగుండం సోమారపు సత్యనారాయణ

దుబ్బాక సోలిపేట రామలింగారెడ్డి

హుస్నా బాద్ వొడితెల సతీశ్ కుమార్

మెదక్ పద్మా దేవేందర్ రెడ్డి

నర్సాపూర్ చిలుముల మదన్ రెడ్డి

ఆందోల్ క్రాంతి కుమార్

పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి

మహబూబ్ నగర్ వి.శ్రీనివాస్ గౌడ్

జబ్చర్ల లక్ష్మారెడ్డి

దేవర కద్ర ఆలె వెంకటేశ్వర రెడ్డి

నారాయణ్ పేట్ రాజేందర్ రెడ్డి

నాగార్జున సాగర్ నోముల నర్శింహయ్య

మక్తల్ చిట్లెం రామ్ మోహన్ రెడ్డి,

నాగర్ కర్నూల్ మర్రి జనార్థన్ రెడ్డి

కొల్లాపూర జూపల్లి కృష్ణారావు

అచ్చంపేట్ గువ్వల బాలరాజు

SHARE